రాగి పాత్రలో మజ్జిగా తాగితే ఏమవుతుందో తెలుసా..?

సాధారణంగా చెప్పాలంటే రాగి పాత్ర( Copper vessel ) లో నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదని పెద్ద వారు చెబుతూ ఉంటారు.ఉదయాన్నే రాగి పాత్ర లో నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

 Do You Know What Happens If You Drink Buttermilk In A Copper Vessel , Copper Ves-TeluguStop.com

ఇది పొట్ట, మూత్ర పిండాలు, కాలేయాలను( Stomach, kidneys, liver ) శుభ్రం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.అలాగే చాలా మంది రాత్రి పూట రాగి పాత్రలో నీళ్లు పోసి ఉదయం తాగుతుంటారు.

కానీ రాగి పాత్ర లో మజ్జిగ ( buttermilk )తీసుకోవడం అసలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే పెరుగులోని గుణాలు లోహం తో ప్రతిస్పందిస్తాయి.

కొంత మంది రాగి పళ్లెంలో అన్నం కూడా తింటూ ఉంటారు.

ఆ సమయంలో అందులో పెరుగు తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.లేదంటే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.అలాగే ఇతర పాల ఉత్పత్తులను కూడా రాగి పాత్రలో ఉంచడం హానికరం అని కూడా చెబుతున్నారు.

పాలలోని ఖనిజాలు విటమిన్లతో రాగి సంకర్షణ చెందుతుంది.ఇది ఫుడ్ పాయిజన్ కు కూడా దారి తీసే అవకాశం ఉంది.

అంతే కాకుండా ప్రతి చర్య కారణంగా వికారం, ఆందోళన లాంటి సమస్యలు ఏర్పడతాయి.

అలాగే మామిడి కాయ పచ్చళ్ళు, సాస్లు, జామ్ లు ఎప్పుడు కూడా రాగి పాత్ర లో తినకూడదు.అలాగే వాటిని రాగి పాత్ర లో అస్సలు భద్రపరచకూడదు.ఇంకా చెప్పాలంటే ఉదయాన్నే పరిగడుపున నిమ్మరసంలో తేనె కలిపి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దొరుకుతాయి.

అయితే రాగి గ్లాసులో నిమ్మ రసాన్ని తాగడం అసలు మంచిది కాదు.ఇలా చేయడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్ లాంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే నిమ్మకాయలోని ఆమ్లం రాగితో చేరితే ఇలాంటి సమస్యలే వస్తాయని కూడా చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube