Actor Krishna Bhagwan : ఎంతో ట్యాలెంట్ ఉన్న కృష్ణ భగవాన్ కెరీర్ ఎందుకు డీలా పడింది

నేను పంచులు వేయకుండా ఉండలేను అది నా బలహీనత అంటూ తనదైన కామెడీ తో జనాలను కడుపుబ్బా నవ్వించిన నటుడు కృష్ణ భగవాన్.పశ్చిమ గోదావరి జిల్లా కైకవోలు లో పుట్టిన కృష్ణ భగవాన్ తొలుత చెన్నై లో అవకాశాల వేట సాగించారు.

 Krishna Bhagavan Career Up And Downs , Krishna Bhagavan ,actor Krishna Bhagwan-TeluguStop.com

 వంశి దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమాతో తన సినిమా కెరీర్ ని మొదలు పెట్టిన కృష్ణ భగవాన్ కి కెరీర్ మలుపు తిరగలేదు.ఈ సినిమా 1988 లో వచ్చిన ఆ తర్వాత 2002 లో వచ్చిన అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది.

ఈ సినిమా లో అయన పంచులకు జనాలు కడుపుబ్బా నవ్వారు.ఈ సినిమా మంచి సాలిడ్ హిట్ అవ్వడం తో అయన వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఇక 2002 తర్వాత 2018 వరకు కృష్ణ భగవాన్ అనేక సినిమాల్లో నటించారు.ఏప్రిల్ 1 విడుదల సినిమాకు గాను రైటర్ గా కూడా పని చేసారు.

ఊహలు గుసగుసలాడే సినిమాకు నరేషన్ కూడా చేసారు.ఇక 2020 లో వచ్చిన రాగల 24 గంటలు సినిమా కోసం మరో సారి రైటర్ గా మారారు.

ఇక ప్రస్తుతం కామెడీ షో లకి జడ్జి గా వ్యవహరిస్తున్నాడు.ఇక కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో హీరోగా జాన్ అప్పారావు 40 + సినిమా చేయగా అందులో హీరోయిన్ గా సిమ్రాన్ నటించింది.

బొమ్మనా బ్రదర్స్ చందన సిస్టర్స్ వంటి సినిమాలో కూడా లీడ్ రోల్ పోషించాడు.ఈ సినిమా ఫ్లాప్ కావడం తో మళ్లీ అలంటి ప్రయోగాలు చేయలేదు.

Telugu Krishna Bhagwan, Bommanabrothers, Judge Shows, Kaikaolu, Maharshi, Simran

ఇక దుబాయ్ సీన్ లో పట్నాయక్ పాత్ర సైతం అయన తప్ప మరెవరు చేయలేరు అనే విధంగా ఉంటుంది.వెంకీ సినిమాలో భగవాన్ పాత్రకు సైతం ఆయనకు మంచి పేరు వచ్చింది.కానీ వందల్లో సినిమాలు చేసిన కృష్ణ భగవాన్ కి రావాల్సినంత పేరు రాలేదనే చెప్పాలి.అందుకు గల ముఖ్య కారణం ఆయనకు గల తాగుడు అనే వ్యసనమే.

ఆ మధ్య కాలంలో ఒక కాలేజీ ఈవెంట్ కి తాగి వెళ్లి నానా రభస చేసాడు.ఇక సినిమాల్లో కూడా అంతే షూటింగ్ కి టైం కి రాడు.

తాగకుండా ఉండలేడు.దాంతో ఆయనకు అవకాశాలు తగ్గాయి.

మళ్లీ కృష్ణ భగవాన్ బిజీ యాక్టర్ అయ్యి ప్రేక్షకులను నవ్వించాలని కోరుకుందాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube