అమెరికాలో భారతీయుల విజయాల జోరు కొనసాగుతోంది.ఒక్కొక్కరుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ అమెరికా ప్రభుత్వంలో ఒక ఉన్నతమైన స్థానాలకి చేరుకుంటున్నారు.
గతంలో ఎన్నో సందర్భాలలో భారతీయులు ఈ విజయాల్ని నిరూపిస్తూ వస్తున్నారు అయితే అమెరికా వంటి అగ్రరాజ్యంలో ఒక భారత సంతతికి చెందిన వాళ్ళు ఉన్నతమైన స్థానాలలో చేరడం మాటలు కాదు మేయర్స్ గా సెనేటర్స్ గా ఎన్నిక కాబడాలి అంటే దానికి ప్రజా మద్దతు కూడా అవసరం.అయితే
భారతీయులకి స్వతహాగా కలిగిన మానవత్వం వలన అక్కడ సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ.
ప్రజలకి చేరువ అవుతూ వారి మద్దతు కూడగట్టుకుంటూ ఉన్నత స్థానాలకి చేరుతున్నారు.ఇదిలాఉంటే అమెరికాలో న్యాయ వ్యవస్థ లలో స్థానం పొందాలంటే మాత్రం ఎంతో ప్రతిభ కావాల్సి ఉంటుది.
ఈ కోవలోనే భారత సంతతి మహిళ దీపా అంబేకర్(41) చేరింది.తన తల్లి తండ్రులు ఎన్నో ఏళ్ల క్రితమే అమెరికాకి వలస వచ్చి అక్కడే స్థిరపడిపోయారు.ఈ క్రమంలోనే దీపా
తన చదువుని న్యూయార్క్ లోనే కొనసాగించింది.చిన్నతనం నుంచీ ఎంతో చురుకుగా ఉండే దీప లాయర్ గా ఎంతో అద్భుతమైన ప్రతిభ కనబరిచేది.అయితే తాజాగా ఆమె న్యూయార్క్ సిటీ సివిల్ కోర్టు తాత్కాలిక జడ్జిగా నియమితులయ్యారు.అయితే గతంలోనే అంటే 2015లో చెన్నైకి చెందిన రాజరాజేశ్వరి న్యూయార్క్ లోని క్రిమినల్ కోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి ఇండో అమెరికన్ కాగా.
ఆ తరువాత ఈ ఘనత సాధించిన రెండో మహిళగా దీప నియమిపబడటం విశేషం.