‘మహానటి’ సక్సెస్‌ గ్యారెంటీ.. ఎందుకంటే!

తెలుగు సినిమా బతికి ఉన్నంత కాలం గుర్తుండే హీరోయిన్‌ సావిత్రి.తెలుగు వారికి ఎప్పుడు హీరోయిన్‌గానే కనిపించే సావిత్రి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.

 Mahanati Movie Success-TeluguStop.com

పెళ్లి నుండి ఆమె చివరకు చనిపోయే వరకు చాలా పరిణామాలు జరిగాయి.అయితే కొన్నింటిపై స్పష్టత లేదు.

సావిత్రి జీవితం గురించి ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయి.ఆ ప్రశ్నలకు సమాధానం వెదుకుతూ తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’.

మూడు సంవత్సరాల పాటు సావిత్రి జీవిత చరిత్రపై రీసెర్చ్‌ చేసి, ఒక అద్బుతమైన స్క్రిప్ట్‌ను రెడీ చేసి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.

తనకు సావిత్రిపై ఉన్న అభిమానంతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించాను అంటూ చెబుతున్న నాగ్‌ అశ్విన్‌ సినిమా విడుదల కాకుండానే సగం సక్సెస్‌ అయ్యాడు.ఏ పని అయినా పూర్తి దృష్టి పెట్టి, మనసు పెట్టి చేస్తే ఖచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నానుడి ఉంది.అలాగే ఈ చిత్రంకు వర్క్‌ చేసిన ప్రతి ఒక్కరు కూడా తమ పూర్తి దృష్టిని, శ్రద్దను పెట్టారు.

అందుకే ఈ చిత్రం ఇంత అద్బుతంగా వచ్చింది.సెట్టింగ్స్‌ నుండి నటీనటుల మేకప్‌ వరకు అన్ని కూడా అద్బుతంగా సెట్‌ అయ్యాయి.

సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌ ఎంపిక తప్పుడు నిర్ణయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.కాని తాజాగా విడుదలైన పోస్టర్‌లు మరియు స్టిల్స్‌ చూస్తే వారే తమ ఆలోచన తప్పని ఒప్పుకుంటున్నారు.

సినిమా టీజర్‌ మరియు పాత్రల లుక్స్‌ అద్బుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కథను కూడా ఒక డాక్యుమెంటరీలాగా కాకుండా ఒక కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న సినిమా మాదిరిగా తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది.పాటలు, నిర్మాణాత్మక విలువలు, సినిమాటోగ్రఫీ అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది.

అందుకే ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

ఒక వేళ సినిమా ఫలితంపై విమర్శకులు పెదవి విరిచినా కూడా ప్రేక్షకులు మాత్రం సావిత్రి గురించి తెలియని విషయాలను తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో థియేటర్లకు క్యూలు కట్టడం నూటికి నూరు శాతం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.

సమంతతో పాటు నాగచైతన్య, విజయ్‌ దేవరకొండ, ద్కుర్‌ సల్మాన్‌, షాలిని పాండే, మోహన్‌బాబు, క్రిష్‌ ఇంకా పలువురు ప్రముఖులు ఈ చిత్రంలో నటించిన కారణంగా కూడా ప్రేక్షకులు ఒక్కసారైనా ఈ చిత్రాన్ని చూడాలనే ఆశతో ఉన్నారు.సో ఖచ్చితంగా మహానటి సక్సెస్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube