అన్నీ తినడం మానేసిన బరువు తగ్గడం లేదా.. అయితే ఇది తెలుసుకోండి?

అధిక బరువు సమస్య అనేది ఇటీవల రోజుల్లో కోట్లాది మందిని తీవ్రంగా సతమతం చేస్తోంది.

ఈ క్రమంలోనే బరువు తగ్గడం( Weight loss ) కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే కొందరు ఎంత ట్రై చేసినా బరువు తగ్గరు.జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్, ఫ్యాట్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, షుగర్, స్వీట్స్, కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇలా బరువును పెంచే ఆహారాలన్నిటిని తినడం మానేస్తారు.

అయినా సరే బరువు తగ్గకపోవడంతో ఎంతగానో కలత చెందుతుంటారు.అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆరోగ్యానికి చెడు చేసే ఆహారాన్ని మానడం మాత్రమే కాదు ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా డైట్ లో చేర్చుకోవాలి.

ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం బరువు తగ్గడానికి సహాయపడుతుంది.మరి అటువంటి ఆహారాలు ఏవో తెలుసుకుందాం పదండి.

Advertisement

తృణధాన్యాలు.ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.వెయిట్ లాస్ కు అద్భుతంగా సహాయపడతాయి.

తృణధాన్యాల్లో క్యాలరీలు తక్కువగా.విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.

అందువల్ల వీటిని తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు.అలాగే వెయిట్ లాస్ కు ఆకుకూరలు చాలా బాగా సహాయపడతాయి.

బరువు తగ్గాలని ప్రయత్నించేవారు నిత్యం ఏదో ఒక ఆకుకూరను తీసుకునేందుకు ప్రయత్నించండి.బెస్ట్ రిసల్ట్ ను మీరు గమనిస్తారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

నట్స్( Nuts ) హెల్త్ పరంగా చాలా మేలు చేస్తాయి.ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి నట్స్‌ ఒక వరం అని చెప్పాలి.రోజుకు గుప్పెడు నట్స్ తీసుకుంటే నీరసం, అలసట వంటివి రాకుండా ఉంటాయి.

Advertisement

చిరు తిండ్లపై మనసు మళ్లకుండా ఉంటుంది.మెటబాలిజం రేటు ఇంప్రూవ్ అవుతుంది.

దాంతో క్యాల‌రీలు క‌రిగే వేగం పెరిగి.త్వరగా బరువు తగ్గుతారు.

సిట్రస్ పండ్లు( Citrus Fruits ) కేవలం ఇమ్యూనిటీ సిస్టమ్ ను బూస్ట్ చేయడానికి మాత్ర‌మే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.వెయిట్ లాస్ కు సహాయపడతాయి.రోజు సిట్రస్ పండ్లు తీసుకుంటే ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.

ఇక బరువు తగ్గాలని ప్రయత్నించేవారు తప్పకుండా తమ డైట్ లో గుడ్డును చేర్చుకోవాలి.గుడ్డు మన లో ఎన్నో పోషక లోపాలను నివారిస్తుంది.

అదే సమయంలో త్వరగా బరువు తగ్గేందుకు గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.

తాజా వార్తలు