తులసి మొక్క చాలా సార్లు వాడిపోతుందా.. అయితే ఈ ప్రమాదకర సమస్యలు...!

మన దేశంలో దాదాపు చాలా మంది ఇళ్లలో తులసి మొక్కలను( Basil plants ) ఎంతో పవిత్రంగా పెంచుకుంటూ ఉంటారు.అయితే కొన్నిసార్లు ఇంట్లో తులసి మొక్క ఎండిపోవడం వల్ల చాలా మంది ప్రజలు ఆందోళన చెందుతూ ఉంటారు.

 Does Tulsi Plant Wither Many Times But These Dangerous Problems , Dangerous Prob-TeluguStop.com

హిందువులు తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారనే సంగతి దాదాపు చాలా మందికి తెలుసు.తులసి మొక్క వాడి పోతే కుటుంబానికి చెడు జరిగే అవకాశం ఉందని బాధపడుతూ ఉంటారు.

తులసి మొక్క వాడిపోతే ఆర్థిక సమస్యలతో( financial problems ) పాటు ఇతర సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

ముఖ్యంగా చెప్పాలంటే తులసి మొక్క వాడి పోయిందంటే ఆ కుటుంబం పై లక్ష్మీదేవి( Goddess Lakshmi ) కోపంగా ఉందని అర్థం చేసుకోవచ్చు.కొన్ని సార్లు వాతావరణం అనుకూలించకపోవడం వల్ల తులసి మొక్క వాడి పోయే అవకాశం ఉంటుంది.తులసి మొక్క ఎండిపోతే అదే మొక్కను మళ్ళీ ఉపయోగించడానికి బదులుగా మరో తులసి మొక్కను నాటితే శుభ ఫలితాలను పొందే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.

కొత్త తులసి మొక్క తెచ్చే వరకు మట్టితో ఉన్న ఆ కుండీని పూజించవచ్చు.ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో ఆ ఇంటికి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది.

తులసి మొక్కను భక్తితో పూజిస్తే పుణ్యఫలం అనుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది.ఇంకా చెప్పాలంటే తులసి మొక్క విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.తులసి మొక్క విషయంలో తప్పులు చేస్తే కూడా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది.తులసి మొక్క ఆకులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయని పండితులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే వాస్తు దోషాలను తొలగించడంలో తులసి మొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి.అలాగే తులసి మొక్క ఆకులు విష్ణువును ప్రసన్నం చేసుకుంటాయని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube