ఉత్తరాదిలో వరద బీభత్సం కొనసాగుతోంది.ఎడతెరపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో అతలాకుతలం అవుతోంది.
ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది.ఇప్పటికే పలు ప్రాంతాలు జలమయం కాగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు భారీ వర్షాలు, వరదలతో ప్రభుత్వం అప్రమత్తమైంది.ఈ నేపథ్యంలో వర్షాలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమీక్ష నిర్వహిస్తున్నారు.
అటు యమునా నదీ తీవ్ర రూపం దాల్చడంతో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.







