Lunar Eclipse : చంద్రగ్రహణం ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..?

మార్చి 24వ తేదీన హోళికా దహన్( Holika Dahan ) నిర్వహిస్తారు.అలాగే మార్చి 25వ తేదీన రంగుల పండుగ హోలీ జరుపుకుంటారు.

 Do You Know What Kind Of Effect Lunar Eclipse Has On A Person-TeluguStop.com

హోలీ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది.సుమారు వంద సంవత్సరాల తర్వాత హోలీ, చంద్రగ్రహణం కలిసి వస్తున్నాయి.

గ్రహణం ప్రభావం జాతకం మీద కూడా ఉంటుందని జ్యోతిష్యం ఎప్పుటి నుండో చెబుతున్నారు.ఈ గ్రహణం భారత దేశంలో కనిపిస్తుంది.

కానీ దాని ప్రభావం మాత్రం మొత్తం 12 రాశులపై ఉంటుందని జ్యోతిష్య నిపుణులు( Astrologers ) చెబుతున్నారు.చంద్రగ్రహణం నాలుగు గంటల 36 నిమిషాల పాటు ఉంటుంది.

భారత్ లో గ్రహణం కనిపించకపోవడం వల్ల సూతక్ కాలాన్ని పరిగణగల్లోకి తీసుకోరు.

అయితే చంద్రగ్రహణం ప్రభావం ఏ రాశిపై ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి( Aries ) వారికి చంద్రగ్రహణం శుభదాయకంగా ఉంటుంది.ప్రతి ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

హనుమాన్ చాలీసా ( Hanuman Chalisa )పఠించడం మంచిది.వృషభ రాశి వారికి చంద్రగ్రహణం అశుభాలను తీసుకు వస్తుంది.

పని ప్రాంతంలో సమస్యలు ఎదురవుతాయి.వాటి నుంచి ఉపశమనం కలిగేందుకు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం మంచిది.

అలాగే మిథున రాశి వారికి ఈ గ్రహణం శుభప్రదంగా ఉంటుంది.వీరు ఆవులకు పచ్చగడ్డి తినిపించడం మంచిది.

Telugu Astrologers, Bakthi, Devotional, Kindeffect, Hanuman Chalisa, Problems, H

అలాగే కర్కాటక రాశి వారికి ఈ చంద్రగ్రహణం ఆరోగ్య సమస్యలను( Health problems ) కలిగిస్తుంది.తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది.సింహ రాశి వారికి చంద్రగ్రహణం మంచి ఫలితాలను ఇస్తుంది.ఆరోగ్యం పై కాస్త శ్రద్ధ ఉంచాలి.కన్య రాశిలో నే ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.ఫలితంగా ఈ రాశి జాతకులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఆవులకు సేవ చేయడం మంచిది.తులా రాశి వారికి చంద్రగ్రహణం సరైన ఫలితాలను ఇవ్వదు.

ఈ సమయంలో ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి.

Telugu Astrologers, Bakthi, Devotional, Kindeffect, Hanuman Chalisa, Problems, H

వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణం మేలు చేస్తుంది.ఉద్యోగంలో మార్పులు ఉంటాయి.చంద్రగ్రహణం ధనస్సు రాశి వారికి మంచిది కాదు.

ఈ సమయంలో సూర్యుడు బృహస్పతికి చెందిన మీనరాశిలో ఉంటాడు.ఫలితంగా ఇబ్బందులు ఎదురవుతాయి.

అలాగే మకర రాశి వారికి చంద్రగ్రహణం వల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.కుంభ రాశి వారికి చంద్రగ్రహణం అసలు మంచిది కాదు.

స్నేహితుల, బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.డ్రైవింగ్ చేసే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube