మీ ఇంట్లో బ్రహ్మ కమలం వికసిస్తే.. దేనికి సంకేతమో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే బ్రహ్మ కమలా( Brahma Kamala )లను అరుదైన పుష్పాలు అని పిలుస్తారు.ఎవరింట్లో ఆయన ఇలాంటి పుష్పాలు పూస్తే చాలా సంతోషాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

 If Brahma Lotus Blossoms In Your House.. Do You Know What It Is A Sign Of , Br-TeluguStop.com

ఇంట్లో ఈ పుష్పాలు పూస్తే అదృష్టంగా కూడా చాలామంది ప్రజలు భావిస్తారు.ఈ బ్రహ్మ కమలాల విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి మన ఇంట్లో వికసిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.బ్రహ్మ కమలాలు హిమాలయాలలో కనిపించే అరుదుగా పుష్పించే మొక్కలు.

అయితే వర్షాకాలం మొదలయ్యాక ఆగస్టు నెల నుంచి సెప్టెంబర్ మధ్య వరకు ఈ పుష్పాలు వికసిస్తాయి.మొగ్గ తొడిగిన తర్వాత రెండు మూడు వారాలకు బ్రహ్మ కమలం వికర్షిస్తుంది.

అయితే ఈ పుష్పాలు రాత్రిపూట మాత్రమే వికసిస్తాయి.వీటి నుంచి వచ్చే పరిమళాలు అహ్లాదకరంగా ఉంటాయి.

Telugu Bhakti, Brahma Kamala, Devotional, Himalayas, Medicinal, Sunshine-Latest

చాలామంది ఇళ్లలో బ్రహ్మ కమలం మొక్కను పెంచుతూ ఉంటారు.అది సరిగా పెరగనట్లయితే తగిన సూర్యరశ్మి ( sunshine )అందేచోట ఆ మొక్కను ఉంచాలి.అయితే తూర్పు, ఆగ్నేయం దిశలో ఈ మొక్కలను పెంచడం మంచిదని కూడా చెబుతున్నారు.ఎవరింట్లో అయితే బ్రహ్మకమలం వికసిస్తుందో ఆ ఇంట్లో అప్పటి వరకు ఉన్న సమస్యలు అన్ని దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

వివాహం కాని వారు బ్రహ్మ కమలాలతో అమ్మవారికి పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.అలాగే డిప్రెషన్ లో ఉన్నవారు పూజించిన ఆరోగ్యవంతులు అవుతారని చెబుతున్నారు.

Telugu Bhakti, Brahma Kamala, Devotional, Himalayas, Medicinal, Sunshine-Latest

ఇంకా చెప్పాలంటే బ్రహ్మ కమలం రాత్రిపూట మాత్రమే వికసిస్తుంది.అయితే ఆ సమయంలో దానిని కోసి పూజలో పెట్టవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.ఆ సమయంలో బ్రహ్మ కమలాన్ని( Brahma Kamala ) కోసి పూజలో పెట్టవచ్చని చెబుతారు.బ్రహ్మ కమలాలు ఎక్కువగా వికసిస్తే ఇతరులకు వాటిని పంచితే ఎంతో మంచిది అని చెబుతున్నారు.

ఒక్కోసారి ఏ మొక్కను నాటిన ఫలితాలు ఉండకపోవచ్చు.అందుకోసమే ఈ మొక్కలను అనుకూల నక్షత్రంలో నాటాలి.

చెట్లను సోమవారం రోజు రోహిణి నక్షత్రం( Rohini Nakshatra )లో నాటితే మంచి పంట వస్తుందని పండితులు చెబుతున్నారు.ఔషధ మొక్కలను అశ్వినీ నక్షత్రం( Ashwini Nakshatra )లో నాటడం మంచిదని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube