మండలంలోని గుండంచర్ల పంచాయతీ సమీపంలో నల్లమల్ల అడసు( Nallamala )ల్లో వెలిసిన వేనూతల కాటమ రాజు స్వామి, గంగాభవాని తిరునాళ్ళు మంగళవారం రోజు అంగరంగా నిర్వహించనున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే యాదవుల ఆరాధ్యదైవంగా కొలిచే కాటమరాజు గంగాభవాని( Katamaraju Gangabhavani ) అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తారు.
అంతే కాకుండా దేవాలయానికి రంగులు వేసి, విద్యుత్ దీపా అలంకరణ చేసి భక్తులకు ఎలాంటి అ సౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశారు.
ముఖ్యంగా చెప్పాలంటే మంగళవారం రోజు ఉదయం 6 గంటలకు అభిషేక అలంకరణ, పూజా కార్యక్రమాలు ఉంటాయి.
ఇంకా చెప్పాలంటే ఉదయం 10 గంటలకు నుంచి అన్నదాన కార్యక్రమం, రాత్రి 10:15 నిమిషములకు ఉత్సవ విగ్రహాలతో గ్రామ ఉత్సవం నిర్వహిస్తారని కమిటీ సభ్యులు వెల్లడించారు.రాత్రి సత్య హరిచంద్ర పూర్తి నాటకం, బ్రహ్మం గారి నాటకం, మహిళలచే కోలాటం తదితర సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

అంతే కాకుండా గ్రామాల్లో యాదవులు బొల్లావుకు భక్తిశ్రద్ధల తో నైవేద్యం చెల్లించి ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి వీధుల్లో తప్పటలతో ఊరేగించి కాటమ రాజు స్వామి దేవాలయం దగ్గరకు చేరుకుంటారు.ఇంకా చెప్పాలంటే మార్కాపురం ఆర్టీసీ అధికారులు మార్కాపురం పట్టణం గర్ల్స్ హై స్కూల్ నుంచి, గిద్దలూరు ఆర్టీసీ అధికారులు గిద్దలూరు కంభం నుంచి, ఉదయం నుంచే బస్సులు కాటమ రాజు స్వామి దేవాలయం( Katamarajaswamy ) దగ్గరకు వెళ్లే ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.ముఖ్యంగా చెప్పాలంటే భక్తులకు తాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు.అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం.







