ఘనంగా నీలకంఠుడి రథోత్సవం.. అభిషేకాలు..

రథసప్తమిని పురస్కరించుకొని శనివారం ఉమ్మడి జిల్లాలోని దేవాలయాలు కిటకిటలాడాయి.అయితే ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తూ భక్తులు పెద్ద ఎత్తున దేవాలయాలను దర్శించుకున్నారు.నిజామాబాద్ నగరంలోని నీలకంఠ దేవాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.సాయంత్రం నీల కంఠుడి రథోత్సవం అంగరంగ వైభవంగా చేశారు.అంతేకాకుండా ఈ దేవాలయంలో విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలను నిర్వహించారు.శివ నామస్మరణతో దేవాలయ పరిసరాలు మార్మోగిపోయాయి.

 Ratha Saptami Celebrations In Temples , Nizamabad , Neetu Kiran , Ratha Saptam-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే రథోత్సవానికి నగర మేయర్ దండు నీతూ కిరణ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.అశేష భక్త జనం మధ్య రథయాత్ర కొనసాగింది.

అన్ని లాగడానికి భక్తులు పోటీపడ్డారు.దేవాలయం నుంచి తల్లి ఘోరీ వరకు ఈ రథోత్సవం సాగింది.

అంతే కాకుండా ఘోరీ వద్ద ప్రత్యేక పూజలు చేసిన తర్వాత రథం తిరిగి దేవాలయానికి చేరుకుంది.

Telugu Bakti, Devotional, Neetu Kiran, Nizamabad, Ratha Saptami, Telangana-Telug

అంతే కాకుండా ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో వేణు, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సూర్య నారాయణ గుప్తా, కార్పొరేటర్లు రథోత్సవ దేవాలయ కమిటీ చైర్మన్ బిల్లా మహేష్ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.రథయాత్ర సందర్భంగా ఆర్మూర్ వైపునకు వెళ్లే వాహనాలను దారి మళ్ళించారు.బస్సులు జిల్లా పరిషత్ చౌరస్తా ఎడమవైపు నుంచి రామాలయం, చంద్రఖర్‌ కాలనీ బైపాస్ రోడ్డు మీదుగా మళ్ళించారు.

అయితే దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఆటంకాలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.అంతే కాకుండా దేవాలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అత్యవసర పరిస్థితి వచ్చినా కూడా ఆసుపత్రికి తరలించేలా అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచారు.

భక్తుల వాహనాల పార్కింగ్ కొరకు ప్రత్యేకమైన స్థలాలను కేటాయించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube