సొంతింటి కలను నెరవేర్చే భూ వరాహస్వామి.. ఈ ఆలయాన్ని దర్శిస్తే కోరిన కోరికలు తీరతాయా?

మనలో చాలామంది సొంతింటి కలను( Home ) నెరవేర్చుకోవాలని భావించడంతో పాటు ఆ కలను నెరవేర్చుకోవడం కోసం రేయింబవళ్లు కష్టపడుతూ ఉంటారు.కొంతమందికి ఆ కల సులువుగానే నెరవేరితే మరి కొందరికి మాత్రం ఆ కల నెరవెరే విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.

 Significance Of Kalahalli Bhoo Varahaswamy Temple Details, Bhoo Varahaswamy, Bh-TeluguStop.com

అయితే ఒక ఆలయాన్ని దర్శించుకుంటే మాత్రం సొంతింటి కల కచ్చితంగా నెరవేరుతుంది.ఆలయంలోని భూ వరాహ స్వామిని( Bhoo Varahaswamy ) పూజించడం ద్వారా కన్న కలలను కచ్చితంగా నెరవేర్చుకోవచ్చని చాలామంది భావిస్తారు.

ఎంతోమంది భక్తులు వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి చేరుకుని మట్టి, ఇటుకలకు పూజలు చేసి వాటిని ఇంటికి తీసుకెళ్లి ఆ తర్వాత ఇంటికి సంబంధించిన పనులను మొదలుపెడతారు.ఈ విధంగా చేయడం వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇంటి నిర్మాణం మొదలవుతుందని చాలామంది భావిస్తారు.

కర్ణాటక రాష్ట్రంలోని( Karnataka ) మండ్య జిల్లా కే.ఆర్.పేటె, వరాహనాథ కల్లహళ్లిలో( Varahanatha Kalahalli ) ఈ ఆలయం ఉంది.

Telugu Bhoovarahaswamy, Dream, Kalahallibhoo, Karnataka, Varahaswamy-Latest News

ఈ ఆలయానికి ఏకంగా 3,000 సంవత్సరాల చరిత్ర ఉంది.ఈ ఆలయంలో భూవరాహ స్వామి లక్ష్మీదేవి సమేతుడై, చతుర్భుజుడిగా దర్శనమిస్తాడు.స్థల పురాణం ప్రకారం ఈ ఆలయంలో హిరణ్యాక్షుడు( Hiranyakshudu ) అనే అసురుడిని సంహరించడానికి నారాయణుడు వరాహ రూపాన్ని దాల్చాడు.

ఇక్కడి ఆలయ ప్రాంగణంలోనే మట్టి, ఇటుకలు లభిస్తాయి.ఈ ఆలయానికి చేరుకోవాలనుకునే భక్తులు పాండవపుర రైల్వే స్టేషన్ వరకు రైలులో చేరుకోవచ్చు.

Telugu Bhoovarahaswamy, Dream, Kalahallibhoo, Karnataka, Varahaswamy-Latest News

బస్సులో ప్రయాణం చేయాలభి భావించే వాళ్లు బెంగళూరు నుంచి ఆర్టీసీ బస్సు ద్వారా ప్రయాణం చేయవచ్చు.మైసూరు నుంచి బస్సులు, ప్రైవేట్ వాహనాలలో సైతం ఆలయానికి చేరుకునే అవకాశం అయితే ఉంటుంది.సొంత వాహనాలలో ఈ ఆలయానికి రావాలని భావించే వాళ్లు మండ్య జిల్లా పాండవపుర నుంచి భూపనకెరె మీదుగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు.ఈ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని ఇక్కడి పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube