ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఫేస్ చేస్తున్న సమస్యల్లో బెల్లీ ఫ్యాట్( Belly fat ) అనేది ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.ముఖ్యంగా కొందరికి శరీరం మొత్తం సన్నగానే ఉన్న పొట్ట మాత్రం లావుగా కనిపిస్తుంది.
బాన పొట్ట కారణంగా శరీర ఆకృతి అందవిహీనంగా మారుతుంది.ఈ క్రమంలోనే పొట్టను తగ్గించుకోవడం కోసం ముప్ప తిప్పలు పడుతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే గ్రీన్ జ్యూస్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

నిత్యం ఈ గ్రీన్ జ్యూస్ ను తాగితే మీ పొట్ట ఎంత లావుగా ఉన్న నెల రోజుల్లో కరిగిపోతుంది.మీరు నాజూగ్గా మారతారు.మరి ఇంతకీ ఆ గ్రీన్ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక కీర దోసకాయ( Cucumber ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కీర దోసకాయ ముక్కలు వేసుకోవాలి.అలాగే ఐదు నుంచి ఆరు ఫ్రెష్ పుదీనా ఆకులు( Fresh mint leaves ), హాఫ్ టేబుల్ స్పూన్ మునగాకు పొడి( Munagaku powder ), ఒక రెబ్బ కరివేపాకు మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె కలుపుకొని ఉదయాన్నే తీసుకోవాలి.రోజు మార్నింగ్ ఈ గ్రీన్ జ్యూస్ ను తయారు చేసుకుని ఫ్రెష్ గా తాగేస్తే అద్భుత ఫలితాలు పొందుతారు.ఈ గ్రీన్ జ్యూస్ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును వేగంగా కరిగిస్తుంది.
బాన పొట్టను ఫ్లాట్ గా మారుస్తుంది.అలాగే ఈ గ్రీన్ జ్యూస్ శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది.
బాడీని హైడ్రేట్ గా ఉంచుతుంది.హెయిర్ ఫాల్ ను అడ్డుకుంటుంది.
చర్మాన్ని అందంగా యవ్వనంగా సైతం మెరిపిస్తుంది.