రక్తహీనత( anemia ).మన దేశంలో 50 శాతానికి పైగా మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారు.
అలాగే పురుషుల్లో 25 శాతం మందిని మరియు పిల్లల్లో 65 శాతం మందిని రక్తహీనత వెంటాడుతుంది.ఎక్కువ శాతం మంది రక్తహీనతను చాలా చిన్న సమస్యగా భావిస్తుంటారు.
కానీ రక్తహీనత వల్ల ఒక వ్యక్తి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అనేక ఇబ్బందులను ఫేస్ చేయాల్సి ఉంటుంది.రక్తహీనత వల్ల నీరసం, త్వరగా అలసిపోవడం, ఆయాసం, కాళ్ళ వాపులు, గుండె దడ, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం, కళ్ళు తిరగడం లాంటి సమస్యలు వేధిస్తాయి.

వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే మొదట రక్తహీనతను దూరం చేసుకోవాలి.అయితే రక్తహీనతను వదిలించడానికి కొన్ని కొన్ని ఆహారాలు చాలా బాగా సహాయపడతాయి.ఈ జాబితాలో జీలకర్ర( cumin ) కూడా ఒకటని మీకు తెలుసా.? అవును మీరు విన్నది నిజమే.రక్తహీనతతో బాధపడే వారికి జీలకర్ర ఒక వరం అని చెప్పుకోవచ్చు.జీలకర్రలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.పిల్లలకు ఎదుగుదలకు ఐరన్ అవసరం.ఆడవాళ్లకు ఋతుస్రావం సమయంలో కోల్పోయిన రక్తాన్ని భర్తీ చేయడానికి.
.రక్తహీనతను తరిమి కొట్టడానికి ఐరన్ అవసరం.

రక్తహీనతతో బాధపడేవారు రోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీ స్పూన్ జీలకర్ర పొడి( Cumin powder ) కలిపి తీసుకోవాలి.లేదా నిత్యం అర టీ స్పూన్ జీలకర్ర నేరుగా నోట్లో వేసుకుని నమలి తినొచ్చు.ఇలా చేస్తే రక్తహీనత నుంచి త్వరగా బయటపడతారు.అలాగే జీలకర్రను నిత్యం తగు మోతాదులో తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.మధుమేహం, రక్తపోటు( Diabetes, hypertension ) వంటి వ్యాధులు నియంత్రణలో ఉంటాయి.అధిక బరువు సమస్య నుంచి బయటపడతారు.
అంతేకాకుండా జీలకర్రలో ఫ్లేవనాయిడ్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి.ఇవి మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.
సెల్ డ్యామేజ్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేసి క్యాన్సర్ బారిన పడకుండా అడ్డుకుంటాయి.