ఈ సింపుల్ మాస్క్ తో పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే గ్లోయింగ్ అండ్ గ్లాస్ స్కిన్ పొందవచ్చు..!

తమ ముఖ చర్మం(face Skin) అందంగా కాంతివంతంగా మెరిసిపోతూ కనిపించాలని కోరుకోని వారు ఉండ‌రు.అయితే అటువంటి స్కిన్ ను పొందాలంటే కచ్చితంగా నెలకు రెండు సార్లు బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిందే అని కొందరు భావిస్తూ ఉంటారు.

 Try This Simple Face Mask For Glowing And Glass Skin! Glowing Skin, Glass Skin,-TeluguStop.com

కానీ అవసరం లేదు.సెల్ఫ్ కేర్ కు మించిన ట్రీట్మెంట్ మరొకటి ఉండదు.

అలాగే చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు కూడా చాలా ఎఫెక్టివ్ గా సహాయపడతాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే సింపుల్ మాస్క్(Mask) ను కనుక ట్రై చేస్తే పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే సూపర్ గ్లోయింగ్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందవచ్చు.

Telugu Tips, Glass Skin, Skin, Latest, Simple Face, Skin Care, Skin Care Tips-Te

అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టమాటో(Tomato) స్లైసెస్, రెండు కీర దోసకాయ(Cucumber) స్లైసెస్, రెండు లెమన్ స్లైసెస్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, పావు టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి.చివరిగా సరిపడా టమాటా కీర లెమన్ జ్యూస్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Glass Skin, Skin, Latest, Simple Face, Skin Care, Skin Care Tips-Te

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఆ సింపుల్ మాస్క్ కనుక వేసుకుంటే అదిరిపోయే బ్యూటీ బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.ముఖ్యంగా ఈ మాస్క్ చనిపోయిన చర్మ కణాలను మరియు మలినాలను తొలగిస్తుంది.

చర్మాన్ని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.డల్ స్కిన్‌ను ప్రకాశవంతంగా మార్చడంలో మరియు పిగ్మెంటేషన్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది.

ఈ మాస్క్ చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.చర్మం అద్దంలా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube