దాదాపు అందరూ తమ జుట్టు ఒత్తుగా(thick hair) పొడుగ్గా పెరగాలని కోరుకుంటారు.కానీ ఆ కోరిక చాలా మందికి కోరికగానే మిగిలిపోతుంది.
ఎన్ని రకాల ఉత్పత్తులు వాడిన కూడా జుట్టు మాత్రం పెరగదు.మీరు కూడా ఈ ప్రాబ్లం తో బాధపడుతున్నారా.? అయితే అస్సలు చింతించకండి.ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ హోమ్ మేడ్ సీరంను వాడితే సూపర్ లాంగ్ అండ్ థిక్ హెయిర్(super long and thick hair) మీ సొంతం అవ్వడం ఖాయం.
మరి ఇంతకీ ఆ సీరం ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు, రెండు టేబుల్ స్పూన్లు బియ్యం (Rice)మరియు రెండు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన ఉసిరికాయ ముక్కలు వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టైనర్ సహాయంతో థిక్ గా మారిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ వాటర్ లో మూడు టేబుల్ స్పూన్లు ఉల్లి జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.దాంతో మన సీరం అనేది రెడీ అవుతుంది.
ఇప్పుడు ఈ సీరంను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి.గంట లేదా గంటన్నర అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ సీరం ను కనుక వాడితే మీ జుట్టు ఎదుగుదలకు అవసరమయ్యే పోషణ అందుతుంది. హెయిర్ ఫాల్(Hair fall) సమస్య ఉంటే దూరం అవుతుంది.
జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.
అలాగే ప్రస్తుత చలికాలంలో చాలా మంది డ్రై హెయిర్ సమస్యతో బాధపడుతూ ఉంటారు.ఖరీదైన షాంపూ కండిషనర్ వాడినప్పటికీ పెద్దగా ఫలితం ఉండదు.అయితే షాంపూ చేసుకోవడానికి ముందు పైన చెప్పుకున్న సీరం ను జుట్టుకు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఈ సీరం కురులలో తేమను లాక్ చేస్తుంది.హెయిర్ డ్రై అవ్వకుండా కాపాడుతుంది.