సాధారణంగా కొందరు పిల్లలు చాలా బలహీనంగా మరియు బక్కగా ఉంటారు.ఎప్పుడూ నీరసంగా కనిపిస్తుంటారు.
చదువుల్లో ఆటపాటల్లో ఏ మాత్రం చురుకుతనం చూపించలేకపోతుంటారు.మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటే కచ్చితంగా జాగ్రత్త పడాలి.
వారి డైట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.బయట ఆహారాలను పూర్తిగా అవాయిడ్ చేయాలి.
పోషకాహారాన్ని పిల్లలకు ఇవ్వాలి.ముఖ్యంగా డేలో ఫస్ట్ మీల్ అయిన బ్రేక్ ఫాస్ట్ (Breakfast)లో ఉడికించిన గుడ్డు, నట్స్ అండ్ సీడ్స్ తో పాటు ఇప్పుడు చెప్పబోయే హెల్తీ జ్యూస్ ను కూడా చేర్చండి.
జ్యూస్ తయారీ కోసం ముందుగా ఒక క్యారెట్ ను మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్(Juice) ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో ఒక అరటి పండును(Banana) స్లైసెస్ గా కట్ చేసి వేసుకోవాలి.
అలాగే ఒక కప్పు క్యారెట్ జ్యూస్(Carrot juice), అర కప్పు కాచి చల్లార్చిన పాలు, నాలుగు నైట్ అంతా నానబెట్టిన జీడిపప్పు, నాలుగు బాదం గింజలు(Almonds) మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.దాంతో సూపర్ టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ బనానా జ్యూస్ రెడీ అవుతుంది.

మీ పిల్లల బలహీనత పోవాలంటే వారి బ్రేక్ ఫాస్ట్ లో ఈ జ్యూస్ ను యాడ్ చేయండి.ఆరోగ్యంగా బరువు పెరగడానికి ఈ జ్యూస్ మద్దతు ఇస్తుంది.అలాగే మీ పిల్లల్లో బలహీనతను పోగొడుతుంది.వారిని ఉత్సాహంగా, ఎనర్జిటిక్ గా మారుస్తుంది.అలాగే ఈ క్యారెట్ బనానా జ్యూస్ లో లుటిన్ మరియు జియాక్సంతిన్ ఉంటాయి.ఇవి మీ పిల్లల కళ్ళను ప్రొటెక్ట్ చేస్తాయి.
మెండుగా ఉండే ఇనుము రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచి రక్తహీనతను నివారిస్తుంది.పొటాషియం ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

అలాగే అరటి పండులోని యాంటీ ఆక్సిడెంట్లు పిల్లలను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి.ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.మలబద్ధకం సమస్యను వదిలిస్తుంది.ఇక క్యారెట్ బనానా జ్యూస్ ను మీ పిల్లల బ్రేక్ ఫాస్ట్ లో చేరిస్తే.వారి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.








