రాగులు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే చిరుధాన్యాల్లో రాగులు ముందు వరుసలో ఉంటాయి.
రాగులను పిండిగా చేసి దోస, రోటి, జావ (Dosa, roti, java)వంటివి తయారు చేసుకుని తీసుకుంటూ ఉంటారు.అయితే రాగులతో ఇప్పుడు చెప్పబోయే విధంగా లడ్డూ తయారు చేసుకుని నిత్యం తీసుకుంటే రక్తహీనత (anemia)తో సహా అనేక అనారోగ్య సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి మరియు ఒక కప్పు రాగి పిండి వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని రాగి పిండిలో నాలుగు టేబుల్ స్పూన్లు వేయించి పొట్టు తొలగించి బరకగా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి(Peanut Powder), నాలుగు టేబుల్ స్పూన్లు వేయించుకున్న కొబ్బరి పొడి, హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు జాజికాయ పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
చివరిగా బెల్లం సిరప్ ను తయారు చేసుకుని అందులో సరిపడా పోసి మరోసారి కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల మాదిరిగా చుట్టుకుని స్టోర్ చేసుకోవాలి.ఎంతో రుచికరంగా ఉండే ఈ రాగి లడ్డూలు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.ముఖ్యంగా ఈ లడ్డూలో ఐరన్ (IRAN)పుష్కలంగా ఉంటుంది.
రక్తహీనతతో బాధపడేవారు నిత్యం ఈ లడ్డూలను తీసుకుంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి.రక్తహీనత దూరం అవుతుంది.
అలాగే ఈ రాగి లడ్డూ(Ragi ladhu) కాల్షియం యొక్క మంచి మూలం, ఇది బలమైన ఎముకలు మరియు దంతాలను నిర్మించడంలో సహాయపడుతుంది.
రాగి లడ్డూలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి తోడ్పడతాయి.రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.అంతేకాకుండా బాలింతలలో పాల ఉత్పత్తిని పెంచడానికి ఈ రాగి లడ్డూలు ఉత్తమంగా సహాయపడతాయి.
రాగుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది.ఇది మీకు ఎక్కువ సేపు నిండుగా అనిపించేలా చేస్తుంది మరియు అతిగా తినడాన్ని నిరోధిస్తుంది.
ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి.పైగా గ్లూటెన్ రహితం.
కాబట్టి ఉదరకుహర వ్యాధి ఉన్నవారికి లేదా బరువు తగ్గాలనుకునే వారికి ఈ రాగి లడ్డూలు అనుకూలంగా ఉంటాయి.