తెలుగు సినిమా ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రాజమౌళి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న విషయం తెలిసిందే.
చివరగా ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రాజమౌళి ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం మహేష్ బాబుతో తెరకెక్కించబోయే పనుల్లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగు కూడా మొదల కానుంది.ఆ సంగతి పక్కన పెడితే రాజమౌళి ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.
ఆయన దర్శకత్వంలో పనిచేసిన హీరోలు అందరికీ కూడా స్టార్ హీరో ఇమేజ్ దక్కింది.అయితే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత అదే హీరో మరి ఏ సినిమాలో నటించిన కూడా ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది.ఈ సెంటిమెంట్ ఎప్పటి నుంచో వస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని చాలామంది హీరోలు ప్రయత్నించారు.ఈ సెంటిమెంట్ బ్రేక్ చేయడం ఎవరి తరం కాలేదు.టాలీవుడ్ హీరో ప్రభాస్ లాంటి హీరోలు సైతం ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని అనుకున్నప్పటికీ అది సాధ్యం కాలేదు.
దీంతో ఈ సెంటిమెంట్లో బ్రేక్ చేయడం ఎవరి వల్ల కాదని అనుకున్నారు.ఇక ఆయన గత చిత్రం ఆర్ఆర్ఆర్ లో నటించిన రామ్ చరణ్( Ram Charan ) జూనియర్ ఎన్టీఆర్లు( Jr NTR ) అయినా ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారేమో చూడాలని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.
అయితే ఎట్టకేలకు ఈ సెంటిమెంట్ ని జూనియర్ ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు.ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం దేవర.( Devara ) ఇటీవల భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది.మొదట్లో ఈ సినిమాకు కూడా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత దాదాపుగా 600 కోట్ల వరకు కలెక్షన్స్ ను సాధించింది.
అలా ఎప్పటినుంచో వస్తున్న సెంటిమెంట్ ను బ్రేక్ చేశారు జూనియర్ ఎన్టీఆర్.అయితే ఈ సెంటిమెంట్ ని రాంచరణ్ బ్రేక్ చేస్తాడా లేదా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.
తప్పకుండా ఈ సెంటిమెంట్ బ్రేక్ చేయడం ఖాయమని అనుకున్నారు.కానీ రామ్ చరణ్ ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేయలేకపోయాడు.గేమ్ ఛేంజర్‌తో( Game Changer ) చరణ్ కూడా ఫ్లాప్‌ల సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తాడని అందరూ అనుకున్నారు.కాన అలా జరగలేదు.
మరోసారి రాజమౌళి సినిమా తర్వాత రామ్ చరణ్‌కి ఫ్లాప్ తప్పలేదు.