ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో( Bhubaneswar ) జరిగిన 18వ ప్రవాసీ భారతీయ దివస్( Pravasi Bharatiya Divas ) కార్యక్రమంలో భాగంగా రాజస్థాన్‌కు చెందిన ఎన్ఆర్ఐ… డాక్టర్ రామ్ నివాస్( Dr Ramnivas ) ప్రతిష్టాత్మక ‘ప్రవాసీ భారతీయ సమ్మాన్ 2025 ’( Pravasi Bharatiya Samman 2025 ) అవార్డ్‌కు ఎంపికయ్యారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( President Droupadi Murmu ) చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
రాజస్థాన్‌లో పుట్టి పెరిగిన రామ్ నివాస్.ప్రస్తుతం మయన్మార్‌లోని( Myanmar ) సన్యాసులకు భారతదేశ ప్రాచీన భాష అయిన సంస్కృతాన్ని( Sanskrit ) బోధిస్తున్నారు.
భారతీయ భాషకు అక్కడ ఎనలేని ప్రాచుర్యం కల్పిస్తున్నారు డాక్టర్ నివాస్.
ప్రవాసీ భారతీయ దివస్ ముగింపు రోజున.రాజస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి బృందం.దుబాయ్, యూకే, ఒమన్, మారిషస్, ఖతార్, ఉగాండాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన రాజస్థాన్ ఎన్ఆర్ఐలతో సంభాషించింది.
రాజస్థాన్( Rajasthan ) కమ్యూనిటీతో సంబంధాలను బలోపేతం చేయడానికి తీసుకుంటున్న కీలక చర్యల గురించి ప్రభుత్వ ప్రతినిధి బృందం.ఎన్ఆర్ఐలకు తెలియజేసింది.రాజస్థాన్‌లో కొత్త వ్యాపార అవకాశాలు, పెట్టుబడి పెట్టడానికి, ప్రభుత్వంతో సహకరించడానికి వీరిని ఆహ్వానించింది.గతేడాది డిసెంబర్ 9 నుంచి 11 వరకు జైపూర్‌లో జరిగిన రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ 2024లో ప్రవాసీ రాజస్ధానీ కమ్యూనిటీ పెద్ద సంఖ్యలో పాల్గొంది.
ఇకపోతే.ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమంలో పాల్గొంటున్న రాజస్ధాన్ ఫౌండేషన్ కమీషనర్ డాక్టర్ మనీష్ అరోరా నేతృత్వంలోని రాజస్ధాన్ ప్రభుత్వ ప్రతినిధి బృందం.గత శుక్రవారం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసింది.ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రాజస్థానీ ప్రవాసులతో సంబంధాలను బలోపేతం చేయడానికి రాజస్థాన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయనకు తెలియజేసింది.
అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను కూడా ఈ ప్రతినిధి బృందం కలిసి.రాజస్థాన్ ఎన్ఆర్ఐల విషయంలో తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు , చొరవను ఆయనకు తెలియజేసింది.