ఇవి మంచి అలవాట్లే .. కాని అతి చేస్తే ప్రమాదం

అతివృష్టికి, అనావృష్టికి మధ్య ఓ గీత ఉంటుంది.గీతకు అటుగా వెళ్లినా, ఇటుగా వచ్చినా ప్రమాదమే.

 Good Habits That Can Also Harm You-TeluguStop.com

అదేరకంగా, మంచి అలవాట్లయినా, మనకి మేలు చేసేవి అయినా, అతి చేయకూడదు.అలాంటి మంచి అలవాట్లలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం.

* నీళ్ళు బాగా తాగాలి అంటారు.రోజుకి ఓ ఎనిమిది గ్లాసుల మంచినీరు తాగడం అత్యవసరం.

నీరు సరిపడ శరీరానికి అందకపోతే డీహైడ్రేట్ అయిపోతుంది మన బాడీ.అదే సమయంలో మనం గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే, మంచి నీరైనా అవసరానికి మించి తాగకూడదు.

అలా చేస్తే శరీరంలో సోడియం లెవెల్స్ బ్యాలెన్స్ తప్పి, శరీరం ఉబ్బటం మొదలవుతుంది.ఈ సమస్య ప్రాణాంతకం కూడా కావచ్చు.

* అహారం శక్తికి అవసరం.కాని అది కూడా సరిపడ తినాలి అంతే.

అతిగా లాగించటం వలన ఏమవుతంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కాని, అల్పాహారాన్ని అల్పాహారం లానే తినండి.హేవి ఫుడ్స్ ఎక్కువ తింటే, అది కూడా ఉదయాన్నే తింటే జీర్ణక్రియకు ఇబ్బంది.

* వ్యాయామం వలన ఎన్నో లాభాలు ఉండొచ్చు.అవన్ని ఓ పద్దతిగా వ్యాయామం చేసినప్పుడే.

శరీరాన్ని ఎంతలా కష్టపెట్టాలో, అంతగా విశ్రాంతిని కూడా ఇవ్వాలి.లేదంటే కండరాలు చీలిపోయే సమస్యే కాదు, మీ ఇంట్లో ఫ్యాట్స్ నే శక్తి కోసం ఉపయోగించుకునే స్థితికి పడిపోతుంది శరీరం.

* శరీరానికి విశ్రాంతినివ్వాలని అంటున్నాం కాబట్టి నిద్ర గురించి కూడా మాట్లాడుకోవాలి.మానవ శరీరానికి 7-8 గంటల సరిపోతుంది.

అంతకు మించి కునుకుతీస్తే డిప్రేషన్, యాంక్సిటి లాంటి మానసిక సమస్యలే కాదు, అధిక బరువు, డయాబెటిస్ లాంటి శారీరక సమస్యలు కూడా మొదలవుతాయి.

* కొవ్వు పదార్థాలు తింటే బ్యాడ్ కొలెస్టరాల్ లెవెల్స్ పెరిగిపోతాయి నిజమే.

అందుకోసం కొవ్వు పదార్థం తినడం తగ్గించడం మంచి అలవాటే.కాని కొవ్వు పూర్తిగా అవసరం లేకుండా పోదు కదా.ఫ్యాట్స్ తీసుకొవడం అతిగా మానేస్తే విటమిన్ డెఫిషియెన్సి, న్యూట్రింట్స్ డెఫిషియెన్సి రావడమే కాదు, క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube