ఉదయం లేవగానే టీ, కాఫీలను తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది.టీ లేదా కాఫీ తోనే రోజును ప్రారంభించేవారు కూడా ఎందరో ఉన్నారు.
అయితే టీ, కాఫీల వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ మాత్రం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
టీ కాఫీలకు బదులుగా రోజు ఉదయం ఈ జ్యూస్ ను తీసుకుంటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ఏంటో.దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక దానిమ్మ పండును తీసుకుని తొక్క తొలగించి లోపల ఉండే గింజలను వేరు చేసి పెట్టుకోవాలి.
అలాగే ఒక మీడియం సైజు బీట్ రూట్ ను తీసుకుని తొక్క చెక్కేసి నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.వీటితో పాటుగా రెండు టమాటోలను తీసుకుని నీటిలో కడిగి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ ని తీసుకుని అందులో దానిమ్మ గింజలు, టమాటో స్లైసెస్, బీట్ రూట్ ముక్కలు, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు, ఐదు ఎండు ద్రాక్షలు, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకుని తాగేయడమే.

ఈ బీట్ రూట్ దానిమ్మ టమాటో జ్యూస్ ను రోజూ ఉదయాన్నే తీసుకుంటే కనుక రక్తహీనత సమస్య దరి దాపుల్లోకి రాకుండా ఉంటుంది.గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.మెదడు మునుపటికంటే చురుగ్గా పని చేస్తుంది.జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది.వెయిట్ లాస్ అవుతారు.
శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి.మరియు చర్మం నిగారింపు యవ్వనంగా సైతం మెరుస్తుంది.







