1.తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడి నోటీసులు

నేషనల్ హెరాల్డ్ కేసులు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడి అధికారులు నోటీసులు జారీ చేశారు.అంజన్ కుమార్ యాదవ్ , గీతా రెడ్డికి ఈ నోటీసులు అందాయి.
2.షర్మిల పాదయాత్ర
వికారాబాద్ నైట్ క్యాంప్ నుంచి 161 వ రోజు పాదయాత్రను వైఎస్ షర్మిల ప్రారంభించారు.
3.మంత్రి కేటీఆర్ కామెంట్స్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు.” రూపాయి ఆల్ టైం కనిష్ట స్థాయికి చేరుకుంది.మేడం ఎఫ్ఎం పిడిఎస్ షాపుల్లో పీఎం ఫోటోల కోసం వెతుకుతూ బిజీగా ఉన్నారు అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు.
4.మావోయిస్టు వారోత్సవాలు
మావోయిస్టు వారోత్సవాలు నేపథ్యంలో ఏజెన్సీలో హై అలెర్ట్ కొనసాగుతోంది.గోదావరి తీర ప్రాంతం పై తెలంగాణ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.తెలంగాణ , చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
5.బతుకమ్మను ఘనంగా నిర్వహించండి

సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలని అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.
6. పోలవరం ముంపు పై భేటీ
పోలవరం ముంపు ముప్పు పై కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో 29 న నాలుగు రాష్ట్రాల అధికారులు అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
7.అక్టోబర్ 17 న ఆర్ ఏంసి సమావేశం

శ్రీశైలం సాగర్ లలో జలవిద్యుత్, రూల్ కర్వ్, వరద జలాల గుర్తింపు పై చర్చించి తుది నిర్ణయం తీసుకునేందుకు వీలుగా అక్టోబర్ 17న రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించాలని కృష్ణా నది యాజమాన్య నిర్ణయించింది.
8. తెలంగాణ కు స్వచ్ఛ భారత్ మిషన్ అవార్డులు
తెలంగాణ కు స్వచ్ఛ భారత్ మిషన్ అవార్డులు తెలంగాణకు దక్కాయి.ఈ మేరకు జాతీయ జల్ జీవన్ మిషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది.
9.జోనల్ స్థాయి క్రీడలు వాయిదా వేయండి

బతుకమ్మ పండుగను సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు ఉపాధ్యాయులు జరుపుకునేందుకు వీలుగా అదే రోజు ప్రారంభమవుతున్న గురుకుల జోనల్ క్రీడా పోటీలను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం కోరింది.
10. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే
తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.కేరళలో రాహుల్ నిర్వహిస్తున్న పాదయాత్రలో పాల్గొన్న వెంకటరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
11.ఈటెల రాజేందర్ కామెంట్స్

టిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ద్వారా ప్రజలకు ఇచ్చేది గోరంత అని, దోచుకునేది కొండంత అని హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శలు చేశారు.
12.బండి సంజయ్ యాత్ర
ఇబ్రహీం పట్టణంలో వీరపట్నంగా మార్చాలా వద్దా అని బిజెపి నేత బండి సంజయ్ అన్నారు.ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన ప్రసంగించారు.
13.జగన్ పై పురందేశ్వరి కామెంట్స్

ఏపీలో జగన్ రివర్స్ పాలన చేస్తున్నారని కేంద్ర మాజీమంత్రి బిజెపి నాయకులు దగ్గుబాటి పురందరేశ్వరి విమర్శించారు.
14.ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ పొడిగింపు
కారు డ్రైవర్ హత్య కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ ను రాజమండ్రి ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు అక్టోబర్ 7 వరకు పొడిగించింది.
15.రాయలసీమ వర్సిటీ పరిధిలో డిగ్రీ అడ్మిషన్లకు హైకోర్టు అనుమతి

రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కళాశాలలు అడ్మిషన్లు జరుపుకునేందుకు హైకోర్టు అనుమతించింది.లోపాలు ఉంటే నెలరోజుల్లో సరిచేసుకోవాలని కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది.
16.డిజిపి కి చంద్రబాబు లేఖ
సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అరెస్ట్ పై ఏపీ డీజీపీ కి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లేఖ రాశారు.
17.వివేకా హత్య విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కోసం ఢిల్లీ నుంచి సీబీఐ విచారణ అధికారి రామ్ సింగ్ కడప కు చేరుకున్నారు.
18.అమరావతి రైతుల పాదయాత్ర
రాజధాని రైతుల మహా పాదయాత్ర ఈ రోజు పెదన, గుడివాడ నియోజకవర్గాల్లో కొనసాగనుంది.
19.పెద్ద పులి సంచారం

విజయనగరం జిల్లాలోని మెరకముడిధాం మండలం శ్యాతంవలసలో పెద్ద పులి సంచారంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -46,500
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 50, 730