సినిమా రంగం అనేది ఓ రంగుల ప్రపంచం.ఇందులోని జనాల జీవితాలు ఎప్పుడు కలర్ ఫుల్ గా ఉంటాయో? ఎప్పుడు వెలసిపోతాయో? చెప్పడం కష్టం.ఇక వీరి పెళ్లిల్ల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది.ఇష్టమైతే పెళ్లి చేసుకుంటారు.లేదంటే విడిపోతారు.మళ్లీ ఎవరైనా నచ్చితే వారిని తమ జీవితంలోకి తెచ్చుకుంటారు.
వివాహం,విడాకులు, రెండవ పెళ్లి అనేది కామన్.సినిమా నటులు పెళ్లి చేసుకుంటే ఎన్ని రోజులు కలిసుంటారో అంటారు జనాలు.
ఇండస్ట్రీలో వివాహ బంధానికి ఉన్న విలువ ఏంటో ఈ మాటలతో అర్థం అవుతుంది.ఇప్పటి వరకు టాలీవుడ్ లో రెండు అంతకంటే ఎక్కువ పెళ్లిల్లు చేసుకున్న హీరోలు ఎవరో తెలుసుకుందాం.
ఎన్టీఆర్
తొలుత తన మరదలు బసవతారకంను పెళ్లి చేసుకున్నాడు ఎన్టీఆర్.1985లో ఆమె క్యాన్సర్ తో చనిపోయింది.రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత లక్ష్మీ పార్వతి పరిచయం కావడంత 1993లో పెళ్లి చేసుకున్నారు.అప్పుడు రామారావు వయస్సు 70 ఏండ్లు కావడం విశేషం.
కృష్ణ
కృష్ణ తన బంధువుల అమ్మాయి ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్నాడు.ముగ్గురు పిల్లలయ్యారు.కానీ విజయ నిర్మలతో కలిసి ఆయన పలు సినిమాలు చేశాడు.అప్పుడు ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది.ఇద్దరూ కలిసి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.అప్పటికే విజయ నిర్మలకు పెళ్లైంది.
ఓ కొడుకు ఉన్నాడు. కృష్ణం రాజు
కృష్ణం రాజు మొదటి భార్య సీతా దేవి.ఆమె ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయింది.అప్పటికే వారికి ఓ కూతురు ఉంది.
ఆ తర్వాత శ్యామల దేవిని పెళ్లి చేసుకున్నాడు.వీరికి ముగ్గురు కూతుర్లు.
పవన్ కల్యాన్
ఈయన వివాహాల గురించి నిత్యం రాజకీయ దుమారం చెలరేగుతుంది.పవన్ తొలి భార్య నందిని.ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి.ఆ తర్వాత రేణు దేశాయ్ తో సహజీవనం చేశాడు.2007లో నందినికి విడాకులు ఇచ్చాడు.2009లో రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నాడు.2012లో రేణు, పవన్ విడిపోయారు.ఆ తర్వాత రష్యన్ నటి లెజినోవాను మూడో పెళ్లి చేసుకున్నాడు.
కమల్ హాసన్
కమల్ మొదటి భార్య పేరు వాణి.ఆమెకు విడాకులు ఇచ్చి సారికను పెళ్లి చేసుకున్నాడు.వీరిద్దరి పిల్లలు శృతి, అక్షర.ఆ తర్వాత కమల్, సారిక విడిపోయారు.గౌతమితో సహజీవనం చేశాడు.వీరూ విడిపోయారు.
ప్రస్తుతం నటి పూజా కుమార్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
నాగార్జున
నాగార్జున సినిమాల్లోకి రాకముందే దగ్గుపాటి లక్ష్మితో పెళ్లి జరిగింది.పెళ్లయ్యాక సినిమాల్లోకి రావడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి.విడిపోయారు.
అప్పటికే వారికి ఓ బాబు ఉన్నాడు.అతడే నాగ చైతన్య.
తర్వాత అమలతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది.వీరికి ఓ బాబు పుట్టాడు.
అతడు అఖిల్.
మోహన్ బాబు
మోహన్ బాబు మొదటి భార్య పేరు విద్యాదేవి.వీరికి ఇద్దరు పిల్లలు.విష్ణు, లక్ష్మి.
ఆమె చనిపోవడంతో విద్యాదేవి చెల్లెలు నిర్మలాదేవిని పెళ్లి చేసుకున్నాడు.వీరికి మంచు మనోజ్ జన్మించాడు.
ప్రకాశ్ రాజ్
ప్రకాశ్ రాజ్ మొదటి భార్య లలిత కుమారి.వీరికి ఇద్దరు అమ్మాయిలు.ఆమెతో విడాకులు తీసుకున్న ప్రకాశ్ పోనీ వర్మను పెళ్లి చేసుకున్నాడు.వీరికి ఒక బాబు.
చలం
తండ్రులు కొడుకులు సినిమాలో కలిసి నటించిన చలం, శారద ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అప్పటికే చలం పెళ్లి అయ్యింది.భార్య చనిపోయింది.కొన్నాళ్లకు ఈ జంట విడిపోయింది.
శరత్ బాబు
మొదట ఈయన రమా ప్రభని పెళ్లి చేసుకున్నాడు.ఆమెతో విడాకుల ఆనంతరం స్నేహలతను పెళ్లి చేసుకున్నాడు.ఆ తర్వాత ఆమెకూ విడాకులిచ్చి ఓ జర్నలిస్టును కట్టుకున్నాడు.
రామకృష్ణ
యంగ్ ఏజ్ లోనే పెళ్లి అయని రామకృష్ణ నటి గీతాంజలిని పెళ్లి చేసుకున్నాడు.వీరిద్దరు చాలా కాలం జీవించారు.వీరికి ఓ బాబు పుట్టాడు.
రామకృష్ణ మరణం తర్వాత గీతాంజలి చాలా కుంగిపోయింది.
.