ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యమైన జీవితాన్ని గడపడం అనేది ఎంత కష్టతరంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.మధుమేహం, ఊబకాయం, రక్తపోటు వంటి జబ్బులు సర్వసాధారణం అయిపోయాయి.
అయితే కొన్ని కొన్ని హెర్బల్ డ్రింక్స్ మన ఆరోగ్యానికి చాలా అండగా ఉంటాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ డ్రింక్ తో షుగర్ కంట్రోల్ నుంచి వెయిట్ లాస్ వరకు అదిరే హెల్త్ బెనిఫిట్స్ ను మీ సొంతం చేసుకోవచ్చు.
అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ బాయిల్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము( Ginger ), మూడు దంచిన యాలకులు( Cardamom ), హాఫ్ టీ స్పూన్ నెయ్యి( Ghee ) వేసుకోవాలి.
అలాగే అంగుళం ములేటి రూట్ ( Muleti root )ను కూడా తీసుకుని మెత్తగా దంచి వాటర్ లో వేసి మరిగించాలి.దాదాపు ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మరిగించిన అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ఫిల్టర్ ను చేసుకోవాలి.
అంతే మన హెర్బల్ డ్రింక్ రెడీ అవుతుంది.

ఉదయం లేదా సాయంత్రం వేళలో ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.మధుమేహం ఉన్నవారికి ఈ డ్రింక్ చాలా సూపర్ గా ఉపయోగపడుతుంది.అలాగే నిత్యం ఈ హెర్బల్ డ్రింక్ ను తాగడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది.
దాంతో కేలరీలు కరిగే ప్రక్రియ వేగవంతమై బరువు తగ్గుతారు.

అంతేకాదండోయ్.యాలకులు, ములేటి రూట్, అల్లం, నెయ్యి.ఇవన్నీ ఆరోగ్యానికి అత్యంత మేలు చేస్తాయి.
శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.
వీటితో తయారుచేసిన హెర్బల్ డ్రింక్ ను డైలీ డైట్ లో చేర్చుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది.రక్త శుద్ధి జరుగుతుంది.
శరీరంలోని మలినాలు బయటకు పోతాయి.కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.
హెయిర్ ఫాల్ తగ్గుముఖం పడుతుంది.మరియు ఈ డ్రింక్ మొటిమల సమస్యకు చెక్ చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా సైతం మెరిపిస్తుంది.