రోజు నైట్ ఈ న్యాచురల్ క్రీమ్ ను రాసుకుంటే యవ్వనంగా మెరిసిపోతారు!

ఈ మధ్యకాలంలో చాలా మంది చిన్న వయసులోనే ముసలి ( Old people )వారిలా కనిపిస్తున్నారు.ముడ‌త‌లు, సన్నని గీతలు, చర్మం సాగడం వంటి వృద్ధాప్య లక్షణాలు ముఖంలో కొందరికి కొట్టొచ్చినట్లు కనపడతాయి.

 Try This Natural Cream For Youthful And Glowing Skin! Glowing Skin, Youthful Ski-TeluguStop.com

అయితే కొందరు మాత్రం వ‌య‌సు పైబడిన కూడా చాలా యవ్వనంగా కనిపిస్తూ అందరిని ఆకర్షిస్తుంటారు.అటువంటి చర్మాన్ని మీరు కూడా కోరుకుంటున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్ ను మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.

రోజు నైట్ ఈ క్రీమ్ ను కనుక వాడితే వయసు పెరిగిన మీరు యవ్వనంగా మెరిసిపోవడం ఖాయం.

అందుకోసం ముందుగా ఒక కలబంద ఆకును తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇలా కట్ చేసుకున్న కలబంద ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత క్లాత్ సాయంతో గ్రైండ్ చేసుకున్న అలోవెరా మిశ్రమం నుంచి జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్‌లో ఈ కలబంద జ్యూస్ తో పాటు రెండు టేబుల్ స్పూన్లు వాసెలిన్( Vaseline ) మరియు వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( vitamin e oil ) వేసి డబుల్ బాయిలర్ మెథడ్ లో రెండు నిమిషాల పాటు హిట్ చేశారంటే మన క్రీమ్‌ రెడీ అవుతుంది.

Telugu Tips, Face Cream, Latest, Natural Cream, Skin Care, Skin Care Tips, Natur

ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే తొలగించి వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

రెగ్యులర్ గా ఈ న్యాచురల్ క్రీమ్ ను వాడితే చాలా ప్రయోజనాలు పొందుతారు.

Telugu Tips, Face Cream, Latest, Natural Cream, Skin Care, Skin Care Tips, Natur

ముఖ్యంగా ఈ క్రీమ్ తో స్కిన్ ఏజింగ్ అనేది ఆలస్యం అవుతుంది.ముడతలు, చారలు, చర్మం సాగడం వంటి వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా ఉంటాయి.చర్మం యవ్వనంగా మెరుస్తుంది.

అలాగే ఈ క్రీమ్ డ్రై స్కిన్ సమస్యను దూరం చేస్తుంది.చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

ఆల్రెడీ ముడతలు సమస్యతో బాధపడుతున్న వారు కూడా ఈ క్రీమ్ ను ఉపయోగించవచ్చు.తద్వారా చర్మం బిగుతుగా మారుతుంది.

ముడతలు క్రమంగా దూరమవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube