కొంతమంది యూరిన్( Urine ) పోసిన పెద్దగా వాసన ఏమీ రాదు.మరి కొంతమంది మాత్రం యూరిన్ పోస్తే చాలా దూరం వరకు ఊపిరి పీల్చుకోలేనంతగా దుర్వాసన( Odour ) వస్తూ ఉంటుంది.
బాత్రూం మొత్తం దుర్వాసనతో నిండిపోతుంది.సాధారణంగా మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది.
కాస్త వాసన కూడా ఉంటుంది.అయితే మూత్రం రంగు ముదురుగా మారడంతో పాటు భయంకరంగా దుర్వాసన వస్తూ ఉంటే మాత్రం దానికి కొన్ని రకాల ఆహారాలు, పానీయాలు కారణమని నిపుణులు చెబుతున్నారు.

అలాగే ఇలా విపరీతమైన దుర్వాసనతో పాటు మూత్రం రంగు మారితే వైద్యులను సంప్రదించడం ఎంతో ముఖ్యమని చెబుతున్నారు.సాధారణంగా కాఫీ ( Coffee ) వంటివి తాగడం వల్ల మూత్రం అసహ్యకరమైన వాసన వస్తుంది.కాఫీలో ఉండే కెఫిన్ వల్ల ఇలా బలమైన వాసన వస్తుందని నిపుణులు చెబుతున్నారు.అలాగే కాఫీలో ఉండే ఒక రకమైన సమ్మేళనం కూడా మూత్రానికి బలమైన దుర్వాసనను అందిస్తుంది.
కేఫిన్ వల్ల అధికంగా మూత్రం ఉత్పత్తి అవుతుంది.శరీరాన్ని డిహైడ్రేషన్ బారిన పడేలా చేస్తుంది.
ఇది కూడా ఆ దుర్వాసనకి కారణం అని చెప్పవచ్చు.కాబట్టి కాఫీని రోజుకు ఒకసారి మాత్రమే తాగడం మంచిది.
రోజులో ఎక్కువసార్లు కాఫీ తాగితే ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఇంకా చెప్పాలంటే వెల్లుల్లి, ఉల్లి( Garlic ) అధికంగా వేసిన ఆహారాలను తినడం తగ్గించడం ఎంతో మంచిది.వీటిలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది.అది మూత్రాన్ని కలుషితం చేస్తుంది.
కుళ్ళిన క్యాబేజీ లేదా కుళ్ళిన గుడ్డు నుంచి వచ్చే వాసన లాగా మూత్రం నుంచి దుర్వాసన వస్తుంది.కాబట్టి వీటిని దూరంగా ఉండటమే మంచిది.
ముఖ్యంగా చెప్పాలంటే జీలకర్ర, పసుపు, కొత్తిమీర వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.కానీ అధికంగా తింటే మాత్రం దుర్వాసనకు కారణం అవుతాయి.
ఇంకా చెప్పాలంటే ఈ ఆహార పదార్థాలు జీర్ణమైన తర్వాత కూడా మూత్రంలో ఆ వాసన మాత్రం అలాగే ఉంటుంది.అక్కడ అనేక మార్పులకు గురైన ఆ వాసన బయటకి వచ్చాక దుర్వాసనగా మారిపోతుంది.







