ఆ టాబ్లేట్ గర్భిణీ స్త్రీ వేసుకుంటే బిడ్డ ఈ ప్రమాదంలో పడ్డట్టే

Unexpected Effects Of Paracetamol And Aspirin In Pregnant Women

మనం జ్వరం వచ్చినట్లుగా అనిపించినా, చిన్నపాటి జ్వరం కలిగినా వెంటనే డాక్టరుని కూడా సంప్రదించకుండా paracetamol టాబ్లేట్ వేసుకుంటాం.అంత ఫేమస్ టాబ్లేట్ ఇది.

 Unexpected Effects Of Paracetamol And Aspirin In Pregnant Women-TeluguStop.com

అలా జ్వరానికి paracetamol వేసుకోవం పెద్ద తప్పు కూడా కాదు.ఎందుకంటే ఈ టాబ్లేట్ జ్వరాన్ని ట్రీట్ చేసేది.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) కూడా జ్వరానికి ఈ టాబ్లేట్ నే సజెస్ట్ చేసింది.అలాగే ఇది జ్వరంతో పాటు చిన్నిపాటి ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, పంటినొప్పిని కూడా ట్రీట్ చేస్తుంది ఇది.ఒక్కో డోస్ కి కనీసం 4 గంటల గ్యాప్ ఇచ్చి ఈ టాబ్లేట్ వేసుకుంటే ఫర్వాలేదు.అయితే డోస్ ఎక్కువ అవకూడదు.

ఎక్కువ అయితే స్కిన్ రాషెస్ తీసుకురావడంతో పాటు లివర్ డ్యామేజ్ కి కూడా కారణం అవుతుంది.అయితే ఇదంతా మామూలు జనాలకి.

అదే గర్భిణీ స్త్రీలు అయితే మరో సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు అంటున్నారు పరిశోధకులు.

డెన్మార్క్ కి చెందిన కోపెన్ హాగెన్ యూనివర్సిటీ వారు paracetamol ప్రభావాల మీద ఓ రీసెర్చి చేసారు.

ఈ రీసెర్చిని reproduction అనే హెల్త్‌ జర్నల్ లో ప్రచురించారు.దాని ప్రకారం జ్వరానికో, నొప్పులకో గర్భిణిస్త్రీలు paracetamol వేసుకోవడం అంత సురక్షితం కాదు.

అందులోనూ కడుపులో పెరుగుతున్న బిడ్డ మగ బిడ్డ అయితే.

విషయం ఏమిటంటే paracetamol వలన మగబిడ్డ రిప్రోడక్షన్ సిస్టమ్ ప్రభావితం అవుతుందట.

అంటే మగబిడ్డలో అంగ, వృషణాల్లో లోపాలు ఉండటం, అవి సరిగా పెరగకపోవడం .ఇలా జరిగే అవకాశాలు ఉంటాయంట.పుట్టుకతోనే కొన్ని లోపాలతో పుట్టిన మగబిడ్డ, పెద్దయ్యాక శృంగార సంబంధిత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు డెన్మార్క్‌ పరిశోధకులు.

మరోవైపు, మరో పరిశధోనలో aspirin టాబ్లేట్ తక్కువ డోసేజ్ లో తీసుకుంటే గర్భిణీస్త్రీలకు ఎంతో లాభమని తేలింది.

Aspirin లో డోసేజ్ లో తీసుకోవడం వలన pre – eclampsia అనే సమస్యను ట్రీట్ చేయవచ్చు అంట.ఇంతకి ఈ సమస్య గురించి తెలియని వారిని చెప్పేదేంటంటే, pre – eclampsia ఉన్న గర్భిణీస్త్రీల బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగిపోతుంది.మూత్రంలో ప్రొటీన్ వస్తుంది.బల్డ్ ప్లేట్లేట్స్ పడిపోవడం, లివర్, కిడ్నీల్లో సమస్యలు ఉంటాయి.ఇలాంటి సమస్యలను దూరం చేస్తుందట aspirin.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube