Shani Dosham : ఏలినాటి శని ప్రభావం దూరమవ్వాలంటే.. ఇలా చేయండి..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం( Astrology ) శని గ్రహానికి అధిపతి శనీశ్వరుడు.న్యాయానికి ప్రతీకగా అయిన శని చెడ్డవారిపట్ల ఎంతో కఠినంగా ఉంటాడు.

 Shani Dosham-TeluguStop.com

అలాగే మంచి వారికి అనేక శుభాలను విజయాలను అందిస్తాడు.జాతకం ప్రకారం శని ఒకరి దృష్టితో చూసినప్పుడు ఆ మనిషి అనేక కష్ట నష్టాలను ఎదుర్కొంటాడు.

ఈ సమయంలో వారు 11 శనివారాలు, శనీశ్వరుడిని( Shaneeshwarudu ) ఆరాధిస్తే మొత్తం శని ప్రభావం తోలగకపోయిన కొంచెం అయిన ఉపశమనం తప్పకుండా ఉంటుంది.శనివారం రోజున మూగజీవులకు ఆహారం అందించడం వల్ల శనీశ్వరుడి తీవ్ర ప్రతికూల ప్రభావం ఉపశమించి కొంత ఊరట కలుగుతుంది.

Telugu Astrology, Saturday, Shaneeshwarudu, Shani Dosha-Latest News - Telugu

శని ప్రభావం కారణంగా ఆర్థిక నష్టాలు ఎదుర్కొన్న వారు శనివారం రోజున( Saturday ) తలస్నానం చేసి, మనసులో శనీశ్వరుడుని స్మరించుకుని దోసిడి నిండా నల్ల నువ్వులు( Black Sesame Seeds ) తీసుకుని కుటుంబ పెద్ద తల చుట్టూ మూడుసార్లు తిప్పి, ఇంటికి ఉత్తరం వైపున విసిరేస్తే ధన సంబంధిత నష్టాలు తొలగిపోతాయి.శనీశ్వరుడి శుభదృష్టి కలగాలంటే శనివారం పేదలకు దానం చేసి నమస్కరిస్తే ఆర్థిక బాధలు తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు.శని ప్రభావం కారణంగా ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే అలాంటి వారు శనివారం రోజున నల్ల నువ్వులు పాలలో కలిపి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఈ పాలను రావి చెట్టు మొదలులో పోస్తే సదరు పరిస్థితులు మెరుగుపడతాయి.

Telugu Astrology, Saturday, Shaneeshwarudu, Shani Dosha-Latest News - Telugu

శనివారం రోజు ఆంజనేయుడిని( Lord Hanuman ) పూజిస్తే శని ప్రభావం తొలగి సకల శుభాలు కలుగుతాయి.శనివారం రోజు పూజ చేసిన తర్వాత గోధుమలు, పప్పు, బెల్లం, నెయ్యి, ఉప్పు, పసుపుకొమ్ములు, బంగాళదుంపలు, కూరగాయల్ని దానం చేయడం ఎంతో మంచిది.అలాగే శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని( Lord Venkateswara swamy ) పూజించి 19 వారాలపాటు శనివారం వ్రతం చేయడం వల్ల శని ప్రభావం దూరం అవుతుంది.

అలాగే పుష్యమి నక్షత్రంలో జన్మించిన శనీశ్వరుడికి ఈ మాసం అంటే ఎంతో ఇష్టం.కాబట్టి ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో శనిని పూజిస్తే పౌర్ణమి రోజు శనికి తైలాభిషేకం జరిపించి, నువ్వులు దానం ఇవ్వాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube