ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్( Wedding Season ) నడుస్తోంది.సెలబ్రిటీలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.
అయితే కొందరు సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఫోటోలు షేర్ చేసి ఒక్కసారిగా అభిమానులకు సాగిస్తున్నారు.తాజాగా కూడా ఒక హిందూ హీరోయిన్ పెళ్ళికి రెడీ అయింది.
సడన్గా అందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో అభిమాణులు షాక్ అవుతున్నారు.దాదా సినిమా( Dada Movie )తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ విజయ్ నటించిన బీస్ట్ మూవీలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
అయితే ఇప్పుడు సడన్‌గా పెళ్లి వార్త చెప్పి షాక్ ఇచ్చింది.ఇంతకీ వరుడు ఎవరు? పెళ్లి ఎప్పుడు? అన్న వివరాల్లోకి వెళితే.ఒమన్‌లో పుట్టి పెరిగిన మలయాళీ ముద్దుగుమ్మ అపర్ణ దాస్( Aparna Das ) 2018లో నాన్ ప్రకాషన్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది.ఆ తర్వాత మనోహరం, బీస్ట్, దాదా, ఆది కేశవ( Adikeshava ), సీక్రెట్ హోమ్ లాంటి చిత్రాలతో తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులకు దగ్గరైంది.
ప్రస్తుతం ఒక మూవీ చేస్తోంది.సాధారణంగా హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోరు.కానీ అపర్ణ దాస్ మాత్రం 28 ఏళ్లకే పెళ్లికి రెడీ అయింది.
ముంజుమ్మల్ బాయ్స్ సినిమా( Manjummel Boys )తో పాటు పలు చిత్రాల్లో చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు దీపక పరంబోరల్( Deepak Parambol ) తో ఏడడుగులు వేయబోతోంది.ఏప్రిల్ 24న వివాహం జరగనుంది.ఈ క్రమంలోనే తాజాగా హల్దీ వేడుక( Haldi Celebrations ) గ్రాండ్‌గా జరిగింది.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ ఫోటోలు వీడియోలు చూసిన అభిమానులు కొత్త పెళ్లి కూతురికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.