H-1B Visa Program కోసం ‘ ట్రూత్ సోషల్ ’’ దరఖాస్తు .. నానా మాటలు అన్న ట్రంప్, ఇప్పుడేమో..?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) యాజమాన్యంలోని మీడియా సంస్థ ట్రూత్ సోషల్ .( Truth Social ) హెచ్ 1 బీ వీసా ప్రోగ్రామ్‌ కోసం దరఖాస్తు చేసింది.

 Donald Trumps Truth Social Had Applied For H 1b Visa Program-TeluguStop.com

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా వున్న కాలంలో హెచ్ 1 బీ వీసాలను( H-1B Visa ) పరిమితం చేయాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే.ఏపీ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.ట్రూత్ సోషల్ మాతృ సంస్థ అయిన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ జూన్ 2022లో హెచ్ 1 బీ వీసా కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది.65 వేల డాలర్ల వార్షిక వేతనం అందించే స్థానానికి ఆమోదం కోసం అభ్యర్ధించింది.ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అప్లికేషన్‌కు ఆమోదం తెలిపినప్పటికీ , ఉద్దేశించిన కార్మికుడిని కంపెనీ అంతిమంగా నియమించుకోలేదని పేర్కొంది.

ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ అప్లికేషన్‌ను ముందస్తు నిర్వహణకు ఆపాదించగా.

మాజీ హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ ఛైర్మన్ , ట్రంప్ మిత్రుడు డెవిడ్ నూన్స్( Devin Nunes ) నాయకత్వంలోని కంపెనీ నవంబర్ 2022లో ప్రక్రియను వేగంగా ముగించింది.హెచ్ 1 బీ వీసా ప్రోగ్రామ్ వర్కర్‌ను కంపెనీ ఎన్నడూ నియమించుకోలేదు.

ముందస్తు నిర్వహణలో రూపొందించబడిన ఈ అప్లికేషన్ గురించి ప్రస్తుత మేనేజ్‌మెంట్ తెలుసుకున్నప్పుడు నవంబర్ 2022లో ప్రక్రియను వేగంగా ముగించిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

Telugu Visa Program, Devin, Donald Trump, Visa, Hb Visa Program, Tech, Trump, Em

టెక్ వర్కర్లకు అమెరికాలో పనిచేసేందుకు అవకాశం కల్పించే బిజినెస్ వీసా ప్రోగ్రామ్( Business Visa Program ) గురించి డొనాల్డ్ ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ట్రూత్ సోషల్ వైఖరి వుంది.అమెరికాకు వలసలు తగ్గించాలన్నది ట్రంప్ ప్రధాన ఎజెండా.అధ్యక్షుడిగా వున్న సమయంలో అతని పాలసీలు .ఫ్యామిలీ బేస్డ్ వీసాలు, హెచ్1బీ లాటరీ ప్రోగ్రామ్ వంటి చట్టపరమైన వలసలపై నియంత్రణలను కలిగి వుండేవి.2016 ప్రైమరీ డిబేట్ సందర్భంగా హెచ్1బీ వీసా ప్రోగ్రామ్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇది అమెరికా ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు.

Telugu Visa Program, Devin, Donald Trump, Visa, Hb Visa Program, Tech, Trump, Em

ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కోలాహలం నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ మరోసారి గెలిస్తే హెచ్1బీ వీసా విధానంపై ఎలాంటి వైఖరి అవలంభిస్తారోనని చర్చ జరుగుతోంది.ట్రంప్ మిత్రపక్షాలు.ఈ ప్రోగ్రామ్‌ను ఒక ఉన్నత స్థాయి యంత్రాంగంగా సంస్కరించాలని ఒత్తిడి చేస్తున్నాయి.

ఈ కార్యక్రమం అనేక చిన్న కంపెనీలకు, ప్రత్యేకించి వృత్తిపరమైన, సాంకేతిక సేవలలో నైపుణ్యం కలిగినవారికి ఎంతో సాయం చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube