హనుమాన్, శని దేవుడికి మధ్య వైరం ఎందుకు జరిగిందో తెలుసా..?

ఆంజనేయుడిని( Hanuman ) పూజిస్తే శని ప్రభావం తగ్గుతుందని పెద్దవారు, పండితులు చెబుతూ ఉంటారు.మంగళవారం హనుమాన్ కు ప్రత్యేకం అనుకుంటారు.

 Do You Know Why There Was A Fight Between Lord Shani And Hanuman , Lord Shani, H-TeluguStop.com

కానీ అంతకుమించి పవర్ఫుల్ శనివారం.అయితే శనివారం, శని, హనుమాన్ కి ఏంటి సంబంధం.

దీనిపై పురాణాల్లో ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.రావణుడి చెరలో ఉన్న సీతాదేవిని తీసుకొచ్చేందుకు వానరులు వరాధి నిర్మిస్తారు.

ఆంజనేయుడి సారధ్యంలో రాళ్లపై శ్రీరామ అని రాస్తూ నీటిలో వేస్తారు.ఆ సమయంలో అక్కడికి వెళ్ళిన శని దేవుడిని చూసి తను కూడా వారాధి నిర్మానంలో సహాయం చేయడానికి వచ్చాడని అందరూ అనుకుంటారు.

Telugu Devotional, Hanuman, Hanuman Jayanti, Lord Rama, Lord Shani, Sita Devi-La

కానీ హనుమ పై వక్ర దృష్టి ప్రసరించేందుకు వచ్చాడని చెబుతాడు.అప్పుడు శని( Lord Shani) వెంటనే హనుమాన్ తలపై కూర్చుంటాడు.అయితే వారధి నిర్మాణంలో అడ్డుగా ఉన్నావంటూ స్వామి కార్యం పూర్తయ్యే వరకు తల వదలి కాళ్లు పట్టుకోమని చెబుతాడు.అలాగే అని శని కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆ కాళ్ళ కింద తొక్కి పెట్టేస్తాడు.

పైగా అష్టసిద్ధులు ఉన్న హనుమాన్ ని నెగ్గడం సాధ్యమయ్యే విషయం కాదు.ఆ కాళ్ళ కింద పడిన శని ఇంకెప్పుడు నీ వరకు రాను వదిలిపెట్టమని వేడుకుంటాడు.

ఆ విధంగా శని వక్రదృష్టి నుండి ఆంజనేయుడు తప్పుకోవడంతో పాటు తన భక్తులను కూడా తప్పిస్తాడని అందరి నమ్మకం.

Telugu Devotional, Hanuman, Hanuman Jayanti, Lord Rama, Lord Shani, Sita Devi-La

కాబట్టి శనివారం రోజు పవనసుతుడిని పూజిస్తే శని ప్రభావం తగ్గుతుందని చెబుతారు.అందుకే గ్రహదోషాల నుండి విముక్తి లభించాలంటే హనుమాన్ ని శనివారం రోజున పూజించాలని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా ఎల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉండేవారికి శని బాధల నుండి ఉపశమనం లభిస్తుంది.

కాబట్టి హనుమంతుడిని కేవలం మంగళవారం నాడు మాత్రమే కాకుండా శనివారం రోజున కూడా ప్రత్యేకంగా పూజలు చేయడం వలన శని బాధలు తొలగిపోయి మీ జీవితం సంతోషంతో నిండుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube