మనదేశంలో చాలామంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.అంతేకాకుండా వారి ఇంటి నిర్మాణాన్ని కూడా వాస్తు ప్రకారం నిర్మించుకుంటూ ఉంటారు.
ఆ ఇంటినీ వాస్తు ప్రకారం నిర్మించుకోవడం వల్ల ఆ ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటాయని నమ్ముతారు.వాస్తు శాస్త్రం( Vastu shastra )లో వంటగదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఇంటి వాస్తు సరిగా లేకపోతే ఇది అనారోగ్య సమస్యలకు, సంపద నష్టానికి దారి తీస్తుంది.వాస్తు శాస్త్రంలో వంట గదిలో ఈ వస్తువులను ఎప్పుడు వంటగదిలో ఉండేలా చూసుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు ఆ ఇంటిపై ఉంటాయి.

ముఖ్యంగా చెప్పాలంటే గురువును సూచించే పసుపు వంటగదిలో ఉండవలసిన ముఖ్యమైన వస్తువు.ఇది విష్ణువుకు ఎంతో ఇష్టమైనది.అందువల్ల పసుపు అయిపోకుండా చూసుకోవడం ఎంతో మంచిది.పసుపు అయిపోవడం( Turmeric) పిల్లలు చదువులపై ప్రతికూల ప్రభావం పడుతుంది.అంతేకాకుండా ఇంట్లో శుభకార్యాలలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది.ఇంకా చెప్పాలంటే బియ్యం పూర్తిగా అయిపోకుండా చూసుకోవడం మంచిది.

ఒకవేళ వంట గదిలో బియ్యం అయిపోతే శుక్ర దోషం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.ఇంట్లో బియ్యం ఉంటే లక్ష్మీదేవి సంతోషించే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది.ఇంకా చెప్పాలంటే వంట గదిలో పిండి ఎప్పుడు పూర్తిగా అయిపోకూడదు.దీనివల్ల ఇంట్లో పేదరికం, సమాజంలో వ్యక్తి గౌరవం కోల్పోయే అవకాశం ఉంది.

అందువల్ల ఏ పిండి అయినా సరే అయిపోకుండా ఉండేలా చూసుకోవడం ఎంతో మంచిది.ముఖ్యంగా చెప్పాలంటే ఉప్పు రాహువుతో సంబంధం కలిగి ఉంటుందని చాలా మంది ప్రజలు చెబుతూ ఉంటారు.ఉప్పు మీ వంట గదిలో ఉంచితే రాహువుకు సంబంధించిన అన్ని సమస్యలు దూరం అయిపోతాయి.కాబట్టి ఉప్పు ఎప్పటికీ పూర్తిగా అయిపోకుండా చూసుకోవాలి.ఇంకా చెప్పాలంటే ఉప్పును ఎవరి దగ్గర నుంచి తీసుకోవాల్సి వచ్చినా డబ్బు చెల్లించి తీసుకోవడం మంచిది.అంతేకాకుండా ఎప్పుడూ ఉప్పును గాజు పాత్ర( Salt )లో మాత్రమే ఉంచాలి.
ఇంకా చెప్పాలంటే వంటగదిలో ఆవనూనె( Mustard oil ) అయిపోతే శని దేవుడు కోపగిస్తాడు.వీలైతే ప్రతి శనివారం ఈ నూనె దానం చేయడం వల్ల శుభం కలుగుతుంది.