అక్షయ తృతీయ( Akshaya Tritiya ) హిందూ మతంలో పర్వదినం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.ఆ రోజున లక్ష్మీదేవిని విష్ణువును ప్రజలు ప్రత్యేకంగా పూజిస్తారు.
ఇలా లక్ష్మీదేవిని విష్ణువును( Goddess Lakshmi , Vishnu ) పుజేస్తే సుఖసంపదలు కూడా నెలకొంటాయని వారి నమ్మకం.అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని సాంప్రదాయం కూడా అనుసరిస్తారు.
అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే జీవితంలో చాలా పురోగతి ఏర్పడుతుంది.
అయితే బంగారు కొనడం అందరికీ సాధ్యం అవ్వదు.
అలాంటి పరిస్థితుల్లో బంగారు కొనుగోలు కాకుండా ఇతర చర్యలు కూడా ఉన్నాయి.వీటిని చేయడం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయి.
అక్షయ తృతీయ రోజున పేదవారికి దానం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.అలాగే ఆరోజు దానం చేయాల్సిన వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అక్షయ తృతీయ రోజు కుంకుమ దానం చేయడం చాలా శుభప్రదం.అలాగే వైవాహిక జీవితం గడుపుతున్న వారు ప్రత్యేకంగా అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా కుంకుమ( Saffron ) దానం చేయడం వల్ల వారి వైవాహిక జీవితానికి చాలా మంచి జరుగుతుంది.

ఇలా చేయడం వలన మీకు మీ భాగస్వామికి మధ్య సానిహిత్యాన్ని పెరుగుతుంది.అక్షయ తృతీయ రోజున ఆకలితో ఉన్న లేదా పేద వ్యక్తికి ఆహారాన్ని దానం చేయాలి.ఇలా ఆకలి తీర్చడం చాలా పుణ్యం అని చాలామంది ప్రజలు నమ్ముతారు.ఇలా చేయడం వలన జీవితంలో ఆనందం అలాగే శ్రేయస్సు వస్తుంది.హిందూమతంలో తమలపాకులకు విశిష్ట స్థానం ఉంది.తమలపాకులను( Betel leaves ) పూజకు కూడా ఉపయోగిస్తారు.
అందుకే అక్షయ తృతీయ రోజున తమలపాకులను దానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

తమలపాకులను దానం చేస్తే సంతోషం, అదృష్టాలు లభిస్తాయి.ఇలా చేయడం వలన ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందవచ్చు.జీవితంలో అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి.
అంతేకాకుండా కొబ్బరికాయను దానం చేయడం వలన కూడా మనిషికి మోక్షం లభిస్తుంది.అక్షయ తృతీయ రోజున ఈ నియమాలను పాటించడం వల్ల లక్ష్మీదేవితో పాటు విష్ణువు అనుగ్రహం కూడా ఉంటుంది.