Peanuts : వేరుశనగలను ఇలా తీసుకున్నారంటే అధిక బరువు సమస్యకు బై బై చెప్పవ‌చ్చు!

పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే ఆరోగ్యకరమైన చిరుతిళ్ళలో వేరుశనగ( Peanuts ) ఒకటి.అలాగే చట్నీలు, తాలింపుల్లో కూడా వేరుశనగలను విరివిరిగా వాడుతుంటారు.

 If You Take Peanuts Like This You Will Lose Weight-TeluguStop.com

ఆరోగ్యపరంగా వేరుశెనగలు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.అయితే వేరుశనగలతో అధిక బరువు సమస్యకు( Over Weight ) కూడా చెక్ పెట్ట‌వ‌చ్చని మీకు తెలుసా.? అవును మీరు విన్నది నిజమే.సరైన పద్ధతిలో వేరుశనగలను తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వచ్చు.

ఓవ‌ర్ వెయిట్‌ సమస్య నుంచి బయటపడొచ్చు.అందుకోసం వేరుశనగలను ఎలా తీసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగలు వేసి వాటర్ తో ఒకసారి వాష్ చేయాలి.ఆపై ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న వేరుశనగలు వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు బెల్లం పొడి,( Jaggery ) ఒక కప్పు పీల్ తొలగించి సన్నగా తరిగిన యాపిల్ ముక్కలు( Apple Slices ) వేసుకోవాలి.

చివరిగా ఒక గ్లాసు ఫ్రెష్ కొబ్బరి పాలు, హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేస్తే పీనట్ ఆపిల్ కోకోనట్ స్మూతీ( Peanut Apple Coconut Smoothie ) సిద్ధం అవుతుంది.

Telugu Apple, Coconut Milk, Tips, Jaggery, Latest, Peanutapple, Peanuts-Telugu H

రుచిపరంగా ఈ స్మూతీ అద్భుతం అని చెప్పవచ్చు.అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ స్మూతీని కనుక తీసుకుంటే ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది.

చిరుతిళ్ళు పై మనసు మళ్లకుండా ఉంటుంది.జీవక్రియ చురుగ్గా మారుతుంది.దాంతో క్యాలరీలు వేగంగా కరుగుతాయి.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.

Telugu Apple, Coconut Milk, Tips, Jaggery, Latest, Peanutapple, Peanuts-Telugu H

పైగా ఈ హెల్తీ అండ్ టేస్టీ స్మూతీని డైట్ లో చేర్చుకోవడం వల్ల నీరసం, అలసట దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా పని చేస్తారు.కొబ్బరి పాలు, వేరుశనగలు, యాపిల్, బెల్లం లో ఉండే పోషకాలు ఎముకల‌ను బలోపేతం చేస్తాయి.గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.మరియు బ్రెయిన్ సూపర్ షార్ప్ గా పని చేసేలా ప్రోత్సహిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube