Rajamouli , Alia Bhatt: రాజమౌళి సలహా వల్ల ఆ పద్ధతిని మార్చుకున్న అలియా.. ఏమైందంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ఎస్.ఎస్ రాజమౌళి ( Rajamouli ) ఒకరు.

 Alia Bhatt Interesting Comments On Ss Rajamouli-TeluguStop.com

ఈయన దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమా పై భారీ స్థాయిలోనే అంచనాలు ఉంటాయి.ఇలా రాజమౌళి సినిమాలన్నీ ఈ స్థాయిలో సక్సెస్ కావడానికి కారణం లేకపోలేదు.

ఈయన ఒక చిన్న సన్నివేశమైన చాలా పర్ఫెక్ట్ గా వచ్చేవరకు ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ ఉంటారు.ఇలా సినిమా కోసం ఈయన పడే తపన ఆయన సినిమాలను ఎంతో విజయవంతం చేస్తూ ఉంటాయి.

Telugu Alia Bhatt, Aliabhatt, Rajamouli, Rrr, Tollywood-Movie

ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో బాలీవుడ్ నటి అలియా భట్( Alia Bhatt ) నటించిన సంగతి మనకు తెలిసిందే.ఈమె ఆర్ఆర్ఆర్ ( RRR Movie ) సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా సీత పాత్రలో నటించారు.ఈ సినిమా ద్వారా తెలుగులో కూడా అలియా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఈ క్రమంలోనే అలియా భట్ ఒక వేదికపై మాట్లాడుతూ రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించింది.

నేను ఏదైనా ఒక సినిమా ఎంపిక చేసుకోవాలి అంటే చాలా కంగారు పడతాను ఈ సినిమా చేయాలా వద్దా అన్న సందేహాలు నాలో ఉండేవి ఇదే విషయాన్ని నేను రాజమౌళి గారి వద్ద ప్రస్తావించానని తెలిపారు.

Telugu Alia Bhatt, Aliabhatt, Rajamouli, Rrr, Tollywood-Movie

ఇలా ఒక సినిమా కథ విన్న తర్వాత నేను చాలా టెన్షన్ అవుతానని ఆ సినిమా చేయాలా వద్దా అని అయోమయంలో ఉంటానని ఆలియా తెలపడంతో రాజమౌళి తనకు ఒకటే మాట చెప్పారట మీరు ఏ పని చేస్తున్నా ప్రేమగా చేయండి అదే మీకు విజయాన్ని అందిస్తుందని ఈయన తనకు కొన్ని సలహాలు ఇచ్చారట.సినిమా ఎలా ఉన్నా మీరు ప్రేమతో చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని తెలిపారు.ప్రస్తుతం ఆయన చెప్పిన ఈ పద్ధతిని నేను ఫాలో అవుతున్నానని ఆలియా తెలిపారు.

కెరియర్ మొదట్లో కథల ఎంపిక విషయంలో ఎంతో టెన్షన్ పడే దానిని, సహనం అస్సలు ఉండేది కాదని తెలిపారు.కానీ రాజమౌళి గారి సలహా వల్ల నేను నా పద్ధతి మార్చుకున్నాను అంటూ ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube