చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగదు.నాన్ వెజ్ అంటే ఎంతో ఇష్టంగా తినే జనాలు చాలా మంది ఉంటారు.
అనివార్య కారణాలతో పలువురు అప్పుడప్పుడు నాన్ వెజ్ కు దూరం అవుతారు.వెజ్ వైపు అడుగులు వేస్తారు.
కొంతరు టెంపరరీగా నాన్ వెజ్ మానేస్తే.మరికొందరు పర్మినెంట్ గా గుడ్ బై చెప్తారు.
అలాంటి వారిలో పలువురు హీరోయిన్లు కూడా ఉన్నారు.ఇంతకీ ఆయా హీరోయిన్లు ఎందుకు నాన్ వెజ్ మానేశారో ఇప్పుడు తెలుసుకుందాం.
రకుల్ ప్రీత్ సింగ్
ఈ జీరోసైజ్ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితమే నాన్ వెజ్ కు నో చెప్పింది.బాగా తినీ తినీ తనకు ఇంట్రెస్ట్ పోయిందట.
అందేకాదు.బాడీని ఫిట్ గా ఉంచుకునే ప్రయత్నంలో భాగంగా ఈమె నాన్ వెన్ తీసుకోవడం లేదట.
అంతేకాదు.ఇందకాలం నాన్ వెజ్ బాగా తినేసిన ఈ అమ్మడుకి ఈ మధ్యే కొత్త విషయం తెలిసిందట.
నాన్ వెజ్ తో లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయని జనాలకు బోధిస్తుంది.కొంత కాలంగా జిమ్ముల్లో కసరత్తులు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పూర్తిగా వెజ్ వైపు మళ్లిందట.
జెనీలియా
జెనీలియాకు ఒకప్పుడు ముద్దముద్దకు ఓ ముక్క తినేది.కానీ అనూమ్యంగా నాన్ వెజ్ మానేసింది.తన భర్త మూలంగానే తాను కూడా వెజ్ టేరియన్ గా మారిందట.కొంత కాలం క్రితం తన భర్త రితేష్ కు అనారోగ్యం అయ్యిందట.నాన్ వెజ్ మానేయాలని డాక్టర్లు చెప్పారట.ఆ సమయంలో ఇద్దరూ నాన్ వెజ్ కు దూరం అయినట్లు ఈ క్యూట్ బ్యూటీ వెల్లడించింది.
తమన్నా
ఒకప్పుడు ఈ మిల్కీ బ్యూటీ నాన్ వెజ్ బ్రాండ్ అంబాసిడర్ లా ఉండేది.మాంసం లేకుండా భోజనం చేసేది కాదు.కానీ ప్రస్తుతం ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టింది.దీంతో నాన్ వెజ్ నుంచి వెజ్ వైపు అడుగులు వేసింది.ప్రస్తుతం గ్లామర్ కాపాడుకునేందుకు పూర్తి వెజ్ టేరియన్ గా మారిపోయింది.
అమీ జాక్సన్
చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ బాగా తినే ముద్దుగుమ్మ నెమ్మదిగా వెజిటేరియన్ గా మారిపోయింది.దానికి కారణం ఒకటుంది.తను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నాన్ వెజ్ తీసుకోవద్దని డాక్టర్లు చెప్పారట.
తన ఆరోగ్యం కోసం ఆమె నాన్ వెజ్ కు దూరం అయినట్లు చెప్పింది.ప్రస్తుతం తాను చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించింది.
అమలా పాల్
ఒప్పుడు నాన్ వెజ్ బాగా తీసుకునే అమలా పాల్ కూడా ప్రస్తుతం పూర్తి వెజిటేరియన్ గా మారింది.ఈ క్రిస్టియన్ బ్యూటీ యోగా మీద ఎక్కువ ఫోకస్ పెట్టి నాన్ వెజ్ కు దూరం అయ్యిందట.ప్రస్తుతం ఆకు కూరలు, కూరగాయలు తింటూ ఆరోగ్యంగా ఉంటుందట
.