గుండె దడ.దాదాపు అందరూ ఏదో ఒక సమయంలో దీన్ని ఫేస్ చేసే ఉంటారు.
ఏదైనా వినకూడని విషయం వినప్పుడు, ఎవరైనా భయపెట్టేందుకు ప్రయత్నించినప్పుడు, పరీక్షలకు వెళ్లేముందు గుండె దడ్డకు గురికావడం సర్వసాధారణమే.అయితే కొందరిలో మాత్రం ఈ సమస్య ఎక్కువ సమయం పాటు ఇబ్బంది పెడుతుంది.
ఒత్తిడి, డిహైడ్రేషన్, శరీరానికి నిద్ర సరిపోకపోవడం, అధికంగా మద్యం సేవించడం, రక్తహీనత, గుండెపై శ్రమ పెరగడం, పోషకాల లోపం, గుండె కండరాలు బలహీనంగా మారడం, థైరాయిడ్.ఇలా రకరకాల కారణాల వల్ల గుండె దడ అధికంగా వేధిస్తుంది.

అయితే కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే.గుండె దడను సులభంగా నివారించుకోవచ్చు.మరి ఆ టిప్స్ ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.యాలకులు గుండె దడను తగ్గించడంలో గ్రేట్‌గా సహాయపడతాయి.యాలకుల టీ తాగడం, లేదా యాలకుల పొడి కలిపిన పాలు సేవించడం చేస్తే.దడ తగ్గడంతో పాటుగా గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.
అలాగే ప్రతి రోజు ఇరవై, ముప్పై నిమిషాల పాటు వాకింగ్ చేయాలి.ఇలా చేయడం వల్ల గుండె కండరాలు బలపడి దడ నియంత్రణలోకి వస్తుంది.మొలకెత్తిన విత్తనాలు గుండె పని తీరును పెంచడంలో అద్భుతంగా సహాయపడతాయి.మరియు మొలకెత్తిన విత్తనాల్లో ఉండే పోషకాల తరచూ దడ రాకుండా అడ్డుకుంటాయి.

వారంలో ఒక సారైనా చేపలు తీసుకుంటే.వాటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె సంబంధిత వ్యాధులు దరి చేరకుండా రక్షిస్తాయి.అలాగే బొప్పాయి పండు, అరటి పండు, పుచ్చ, కర్బుజా, ఉల్లి, వెల్లుల్లి వంటివి డైట్‌లో చేర్చుకుంటే.తరచూ గుండె దడ బారిన పడకుండా ఉంటారు.
ఇక వాటర్ అధికంగా తీసుకోవాలి. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.
గుండె వేగాన్ని పెంచే కాఫీలు, టీలు, కూల్ డ్రింకులకు దూరంగా ఉండాలి.బరువును అదుపులో ఉంచుకోవాలి.