ప్రతివారం ఈ విధంగా తల స్నానం చేస్తే మీ జుట్టు రాలమన్న రాలదు.. తెలుసా?

హెయిర్ ఫాల్( Hair Fall ) అనేది అందరిలో ఉండే కామన్ సమస్యే అయినప్పటికీ.కొందరిలో మాత్రం చాలా అధికంగా ఉంటుంది.

 Hair Fall Will Go Away If You Wash Your Head Like This Every Week Details, Hair-TeluguStop.com

ఒత్తిడి, పోషకాల కొరత, ధూమపానం తదితర కారణాల వల్ల హెయిర్ ఫాల్ హెవీ గా ఉంటుంది.అలాగే తల స్నానానికి( Head Bath ) ఉపయోగించే షాంపూ లోని రసాయనాలు కూడా జుట్టు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.

హెయిర్ ఫాల్ ను తీవ్రతరం చేస్తాయి.జుట్టు కుదుళ్లను బలహీన పరుస్తాయి.

రసాయనాలతో కూడిన షాంపూలకు బదులు ప్రతివారం ఇప్పుడు చెప్పబోయే విధంగా తల స్నానం చేస్తే మీ జుట్టు రాలమన్న రాల‌దు.

Telugu Aloevera Gel, Care, Care Tips, Fall, Wash, Bath, Healthy, Lemon, Soap Nut

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కప్పు గింజ తొలగించి మెత్తగా దంచిన కుంకుడు కాయలను( Soap Nuts ) వేసుకోవాలి.అలాగే ఒకటిన్నర గ్లాసు వేడి నీళ్లు పోసి గంట పాటు నానబెట్టుకోవాలి.ఇలా నానబెట్టుకున్న కుంకుడు కాయల నుండి రసం తీసుకోవాలి.

ఈ రసంలో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloevera Gel ) మరియు వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం( Lemon Juice ) వేసి బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ కుంకుడు రసాన్ని ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.

Telugu Aloevera Gel, Care, Care Tips, Fall, Wash, Bath, Healthy, Lemon, Soap Nut

వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ విధంగా తల స్నానం చేయడం వల్ల చాలా లాభాలు పొందుతారు.కుంకుడు కాయలు అనేక జుట్టు సంబంధిత సమస్యలకు చెక్ పెడ‌తాయి.ప్రధానంగా హెయిర్ ఫాల్ ను అడ్డుకుంటాయి.చుండ్రు సమస్యను దూరం చేస్తాయి.చిట్లిన జుట్టును రిపేర్ చేసి కండిషన్ చేస్తాయి.తలలో దురద ఇన్ఫెక్షన్ సమస్యలను నివారిస్తాయి.

అలాగే నిమ్మరసంలో లభించే లిమోనెన్ పొడి జుట్టును పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.నిమ్మరసంలోని యాంటీఆక్సిడెంట్లు మరియు ఇతర పోషకాలు మీ జుట్టును ఆరోగ్యంగా మరియు సిల్కీగా ఉంచడంలో తోడ్ప‌డ‌తాయి.

ఇక అలోవెరా స్కాల్ప్‌ను సున్నితంగా శుభ్రపరుస్తుంది.జుట్టు పెరుగుదలను పెంచుతుంది.

జుట్టును మృదువుగా మెరిసేలా చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube