ఒక్క రాత్రిలో మీ ముఖ చర్మం తెల్లగా కాంతివంతంగా మారాలా? అయితే ఈ రెమెడీ మీకోసమే!

ముఖ చర్మం తెల్లగా కాంతివంతంగా మెరుస్తూ కనిపించాలని అందరూ కోరుకుంటారు.అందులోనూ ఏదైనా ఫంక్షన్ లేదా పెళ్లి ఉంది అంటే ముఖాన్ని వైట్ గా బ్రైట్ గా మార్చుకునేందుకు వారం రోజుల ముందు నుంచే ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

 This Remedy That Will Make Your Face Skin White And Bright Overnight! Skin White-TeluguStop.com

కొందరు బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టి ఫేషియల్ చేయించుకుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే ఫేషియల్(Facial) అక్కర్లేదు.

కేవలం ఒక్క రాత్రిలోనే మీ ముఖాన్ని తెల్లగా మరియు కాంతివంతంగా మార్చడానికి ఈ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బీట్ రూట్ పౌడర్(Beet root powder), హాఫ్‌ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్(Coffee powder), హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు(turmeric), హాఫ్ టేబుల్ స్పూన్ నీమ్ పౌడర్(Neem powder), వన్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్(Muleti powder), హాఫ్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్(Orange Peel Powder) వేసుకుని స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ మరియు సరిపడా రోజ్‌ వాటర్ ను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు ఏదైనా బ్రష్ సహాయంతో కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.ముప్పై నిమిషాల అనంతరం వేళ్ల‌తో సున్నితంగా చర్మాన్ని రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఆపై చర్మానికి ఏదైనా మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.

ఇలా నైట్ నిద్రించే ముందు ఈ రెమెడీని పాటిస్తే కనుక చర్మంపై పేరుకుపోయిన మలినాలు మృతకణాలు తొలగిపోతాయి.ఉద‌యానికి స్కిన్ తెల్లగా మరియు కాంతివంతంగా మారుతుంది.స్కిన్ వైట్నింగ్ కి ఈ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.

మరియు ఈ రెమెడీని తరచూ పాటిస్తే చర్మం నిత్యం ప్రకాశవంతంగా మెరిసిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube