ఎన్టీఆర్ ఏఎన్నార్ కాలంలో మల్టీస్టారర్ సినిమాలు చాలానే ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించేవి అన్న విషయం తెలిసిందే.కానీ బాలయ్య చిరంజీవి వెంకటేష్ కాలంలో మాత్రం ఇలాంటి మల్టీస్టారర్ సినిమాలు దాదాపు కనుమరుగయ్యాయి.
ఒకవేళ సినిమాల్లో ఇద్దరు హీరోలు అవసరమైతే హీరో ద్విపాత్రాభినయం పోషించడం లాంటివి చేసేవారు.కానీ గత కొంత కాలం నుంచి టాలీవుడ్లో మళ్లీ మల్టీస్టారర్ సినిమాల హవా మొదలైంది.
ఈ క్రమంలోనే ఇక స్టార్ హీరోలు కలిసి నటించి సినిమా బ్లాక్బస్టర్ అయ్యేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు కలిసి నటించిన త్రిబుల్ ఆర్ బ్లాక్బస్టర్ అవ్వడం తో మల్టీ స్టారర్ సినిమాలపై మరింత నమ్మకం పెరిగిపోయింది నిర్మాతలకు.
దీంతో ఇద్దరు హీరోల అభిమానులతో కలెక్షన్లు కూడా ఎక్కువగా వస్తాయని దర్శకనిర్మాతలు అనుకుంటున్నారు.ప్రేక్షకులను పలకరించపోతున్న మల్టీస్టారర్ సినిమాలో ఏవో తెలుసుకుందాం.
కే జి ఎఫ్ సినిమా తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమాలో మలయాళ సూపర్స్టార్ రాజ్కుమార్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడని ప్రకటన వెలువడిన నాటి నుంచి ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజిలో పెరిగిపోతున్నాయి.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తో పాటు టాలీవుడ్ బాలీవుడ్ కాదు ఏకంగా హాలీవుడ్ స్టార్.
లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ నటిస్తుండడంతో ఈ సినిమాపై పెరిగిపోతున్న హైప్ అంతా ఇంతా కాదు అని చెప్పాలి.
చిరు హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ఖాన్ నటిస్తూ ఉండడం గమనార్హం.
తమిళ్ మూవీ లూసిఫర్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రలో సల్మాన్ఖాన్ చేస్తున్నాడు.దీంతో ఇక వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై చూసేందుకు ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.
ఈ సినిమాకు పాన్ ఇండియా లెవల్లో బిజినెస్ జరగబోతుంది అన్నది మాత్రం అర్థం అవుతుంది.
యువ దర్శకుడు బాబీ డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 154 సినిమా వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో మెగాస్టార్ తో కలిసి రవితేజ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.దీంతో వీరిద్దరి కాంబినేషన్ చూసేందుకు ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపుతున్నారు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసి అల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.దీంతో ఈ కాంబినేషన్ పై కూడా ఫ్యాన్స్ లో అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి అని చెప్పాలి.ఇలా ప్రతి ఒక్కరు కూడా టాలీవుడ్ లో మల్టీస్టారర్ మంత్రాన్ని జపిస్తున్నారు అని చెప్పాలి.