అద్భుతం: మడతపెట్టే మెట్లు ఎప్పుడైనా చూశారా..?!

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు.ఎప్పుడూ సామాజిక మధ్యమాల్లో ఎదో ఒకటి పోస్టు చేస్తూ యాక్టివ్ గా ఉంటాడు.

 Awesome Have You Ever Seen A Folding Staircase , Folding Steps, Viral Latest, Ne-TeluguStop.com

తనకు ఏదైనా ఇష్టమైన వీడియో కనిపిస్తే వెంటనే షేర్ చేసి వైరల్ చేయడం ఆయనకు ఆలవాటే.ప్రస్తుతం ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

ఆ వీడియో పూర్తి వివరాలు తెలియదు కానీ.ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.

ఓ వ్యక్తి తయారు చేసిన మడతపెట్టే మెట్లు మాత్రం వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వావ్ అని చెప్పాల్సిందే.ఈ వీడియో తనను ఆశ్చర్యానికి గురి చేసిందని, తనని ఎంతో అకట్టుకుందని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ వీడియోలో.ఓ వెల్డర్ తయారు చేసిన మడతపెట్టే మెట్లను పూర్తిగా ఓపెన్ చేసి, ఆ మెట్ల మీద నుంచి పైకి వెళ్లి కిందికి దిగాడు.అనంతరం మెట్లను యథావిధిగా మడతపెడుతున్నాడు.ఈ వీడియో చూసిన నెటిజన్స్ అంతా ప్రపంచంలో ఏమాత్రం సృజనాత్మకత, కొత్తదనం లేకపోతే వెనుకబడిపోవడం ఖాయం అని కొంతమంది మాత్రం కొత్త ఆవిష్కరణలు చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు.

కొన్ని వీడియోలో చూస్తే అద్భుతమని చెప్పొచ్చు.అందులో ఈ వీడియో ఒకటి అంటూ ఆయన కామెంట్ చేయడం విశేషం.

ప్రతి ఇంటికి మెట్లు ఉండడం సాధారణం.దేశ వ్యాప్తంగా జనాభా పెరగడంతో పాటు ఇళ్ళ స్థలాల ధరలు రోజు రోజుకూ పైపైకి ఎకబాగుతున్నాయి.

పట్టణం, నగరాల్లో కొంత స్థలం ఖాళీ ఉంటే చాలు బిల్డింగ్ లు కట్టేస్తున్నారు.ఇలాంటి సందర్భంలో మనం చూసిన మెట్లు నిజజీవితంతో చాలా ఉపయోగపడనున్నాయి.

అవసరం లేకపోతే వీటిని గోడకు అతక్కుపోయేలా మడతపెట్టే అవకాశం ఉందంటూ ఆనంద్ మహేంద్రా తన భావాలను వ్యక్తపరచడం ఇంటర్నెట్ లో వైరల్ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube