బుల్లోడు పేరుతో వచ్చిన సినిమాలలో ఏది హిట్టు ? ఏది ఫట్టు ?

ఘరానా బుల్లోడు, బంగారు బుల్లోడు, సరదా బుల్లోడు.ఇలా బుల్లోడు అనే టైటిల్ తో నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ ముగ్గురు కూడా టాలీవుడ్ పై దండయాత్ర చేయగా ఎవరు హిట్టు కొట్టారు ? ఎవరు కొట్టారు ? అనేది ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.

 Which Is Your Favourite In These 3 Bullodu Movies , Nagarjuna, Varasudocchadu,-TeluguStop.com

90 వ దశకంలో ఈ ముగ్గురు హీరోలు కూడా సూపర్ ఫామ్ లో ఉండి ఇండస్ట్రీకి అనేక హిట్ సినిమాలను అందించారు.నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ దశకంలో రౌడీ ఇన్స్పెక్టర్, బంగారు బుల్లోడు, నిప్పురవ్వ వంటి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశారు.ఇక బంగారు బుల్లోడు సినిమాలో రమ్యకృష్ణ, రవినాటాండన్ హీరోయిన్స్ గా అలరించగా రవినా టాండన్ కి ఇది తొలి తెలుగు సినిమా కావడం విశేషం.1993లో బంగారు బుల్లోడు అలాగే నిప్పురవ్వ ఒకేరోజు విడుదలవగా బంగారు బుల్లోడు ఇండస్ట్రీ హిట్ కొట్టింది.ఇక నిప్పురవ్వ ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది.

ఇక ఇదే దశకంలో నాగార్జున కిల్లర్, వారసుడొచ్చాడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం వంటి సినిమాలతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఇక ఇదే సమయంలో నాగార్జున ఘరానా బుల్లోడు సినిమాలో నటించాడు.ఇక ఈ చిత్రంలో కూడా రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించింది.1995లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కీరవాణి అందించిన సంగీతంతో సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచింది.

Telugu Bangaru Bullodu, Gharana Bullodu, Nagarjuna, Raghavendra Rao, Sarada Bull

ఇక బొబ్బిలి రాజా వంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాతో 90వ దశకాన్ని ప్రారంభించాడు మన విక్టరీ వెంకటేష్.చంటి, కొండపల్లి రాజా వంటి సినిమాలతో ఇదే సమయంలో సూపర్ ఫామ్ లో ఉన్నాడు.సరదా బుల్లోడు అనే సినిమాతో మరోసారి మాయ చేద్దామని వెంకటేష్ భావించిన అది కుదరలేదు.రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నగ్మా హీరోయిన్ గా నటించగా, ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేక చతికల పడింది.

అత్త అల్లుళ్ళ సవాల్ తో కూడిన ఈ చిత్రంలో అలనాటి హీరోయిన్ మంజుల అత్త పాత్రలో నటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube