ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రవితేజ.. బంపర్ ఆఫర్ కొట్టేసిన అమర్ దీప్!

బుల్లి తెర సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అమర్ దీప్( Amar Deep ) ఇటీవల బిగ్ బాస్( Bigg Boss ) లో పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు.ఈ కార్యక్రమం తర్వాత అమర్ సినిమా అవకాశాలను అందుకుంటే హీరోగా కూడా బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.

 Bigg Boss Amardeep Got Acting Chance In Raviteja Movie ,amar Deep,bigg Boss,ravi-TeluguStop.com

ఇకపోతే ముందు నుంచి కూడా అమర్ దీప్ మాస్ మహారాజ రవితేజ ( Raviteja ) ఫ్యాన్ అనే సంగతి మనకు తెలుసు.అమర్ దీప్ బిగ్‌బాస్ లో ఉన్నప్పుడు రవితేజ తన సినిమా ప్రమోషన్స్ కోసం బిగ్‌బాస్ కి వచ్చాడు.

ఇలా బిగ్ బాస్ వేదిక పైకి వచ్చినటువంటి రవితేజ పట్ల అమర్ దీప్ మరోసారి తన ప్రేమని చూపించాడు.రవితేజ కోసం తాను హౌస్ నుంచి బయటకు రావడానికి కూడా సిద్ధమయ్యారు.తనకు ఇంత అభిమానిగా ఉన్నటువంటి అమర్ కి.ఆ క్షణం రవితేజ మాట ఇచ్చారు.  రవితేజ నటించిన నటించబోయే సినిమాలో తనకు తప్పకుండా అవకాశం కల్పిస్తానంటూ బిగ్ బాస్ వేదికపై మాట ఇచ్చారు.అయితే ఆ మాటను రవితేజ నిలబెట్టుకున్నారని తెలుస్తుంది.

తాజాగా అమర్ దీప్ రవితేజ తో షూటింగ్ సెట్స్ లో దిగిన ఫోటోని షేర్ చేసి.నా కల నెరవేరింది.నా దేవుడు నువ్వేనయ్యా.నువ్వంటే నాకు పిచ్చి, ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ పోస్ట్ చేసాడు.దీంతో రవితేజ సినిమాలో అమర్ ఛాన్స్ కొట్టేసారని రవితేజ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలుస్తోంది.ఇలా రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేయడంతో అమర్ అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు చేస్తున్నారు.

ఇక వీరిద్దరూ కలిసి ఏ సినిమాలో నటిస్తున్నారు.ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube