తలనొప్పిని క్షణాల్లో మాయం చేసే మ్యాజికల్ డ్రింక్ ఇది.. తప్పకుండా ట్రై చేయండి!

ఉరుకుల పరుగుల జీవితంలో ఒక్కోసారి విపరీతమైన తలనొప్పి వస్తుంటుంది.ఆ సమయంలో ఏ పని పైన దృష్టి సారించలేకపోతుంటారు.

 This Is A Magical Drink That Can Cure Headache In Seconds! Headache, Magical Dri-TeluguStop.com

చికాకు తార స్థాయికి చేరుకుంటుంది.ఆ టైం లో పక్కన ఎవరున్నా సరే వారిపై అరి చేస్తూ ఉంటారు.

ఇక తలనొప్పిని తగ్గించుకోవడం కోసం పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు.కానీ పెయిన్ కిల్లర్స్ ఆరోగ్యానికి ఏం మాత్రం మంచిది కాదు.

అలాంటి సమయంలో పెయిన్ కిల్ల‌ర్స్ కు బ‌దులుగా ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ ను తీసుకుంటే కనుక క్షణాల్లో తలనొప్పి మాయం అవుతుంది.

పైగా ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

ఎన్నో ఆరోగ్య లాభాలు సైతం లభిస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు కొబ్బరి పాలు వేసుకోవాలి.అర కప్పు వాటర్ వేసుకోవాలి.

అలాగే ప‌ది నుంచి ప‌దిహేను ఫ్రెష్ పుదీనా ఆకులు, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ వేసుకోవాలి.

చివ‌ర‌గా పావు టేబుల్ స్పూన్ పింక్‌ సాల్ట్, ఆర టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి.త‌ద్వారా మన మ్యాజికల్ డ్రింక్ సిద్ధమవుతుంది.తలనొప్పి తీవ్రంగా వేధిస్తున్న సమయంలో ఈ డ్రింక్ ను తీసుకుంటే క్షణాల్లో ఉపశమనాన్ని పొందుతారు.

మెదడు, మైండ్ ప్రశాంతంగా మార‌తాయి.

అంతేకాదు ఈ రిప్రెష్‌ డ్రింక్ తీసుకోవడం వల్ల నీరసం అలసట దూరం అవుతాయి.బాడీ యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా మారుతుంది.అంతే కాదు ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

ఎముకలు.దంతాలు దృఢంగా మారతాయి.

మ‌రియు ఇమ్యూనిటీ సిస్ట‌మ్ సైతం బూస్ట్ అవుతుంది.కాబ‌ట్టి, త‌ల‌నొప్పి వేధిస్తున్న‌ప్పుడు త‌ప్ప‌కుండా ఈ డ్రింక్ ను ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube