విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాశ్ కు చేదు అనుభవం ఎదురైంది.రాణిగారితోట ప్రాంతంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు.
ఈ క్రమంలో దేవినేని అవినాశ్ ను టీడీపీ మహిళలు అడ్డుకున్నారు.దీంతో ఉద్దేశపూర్వకంగానే కార్యక్రమాన్ని చెడగొడుతున్నారని వైసీపీ మహిళలు మండిపడ్డారు.
పరస్పరం దూషించుకున్న మహిళలు దాడులకు పాల్పడ్డారు.కాళ్లల్లో కారం జల్లుకుని కొట్టుకున్నారని సమాచారం.
దీంతో విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
అయితే రిటైనింగ్ వాల్ నిర్మించడం ఓర్వలేకపోతున్నారని వైసీపీ విమర్శిస్తోంది.







