హ‌లో లేడీస్‌.. ఈ త‌ప్పులు చేస్తే మీ గుండె రిస్క్‌లో ప‌డ‌టం ఖాయం..జాగ్ర‌త్త‌!

పురుషుల‌తో పోలిస్తే స్త్రీల‌లో గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ కాస్త త‌క్కువ‌గా ఉండేది.కానీ, ప్ర‌స్తుత రోజుల్లో స్త్రీ, పురుషులిద్ద‌రిలోనూ గుండె జబ్బులు సమాన స్థాయిలో ఉన్నాయి.

 If Women Make These Mistakes, Heart Health Is Damaged! Women, Women Health, Heal-TeluguStop.com

పైగా స్త్రీలు గుండె స‌మ‌స్య‌ల‌కు గురైతే.ప్రాణాలు పోయే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంది.

అందుకే స్త్రీలు గుండె ఆరోగ్యం విష‌యంలో ఎంతో శ్ర‌ద్ధ వ‌హించాలి.ముఖ్యంగా ఇప్పుడు చెప్ప‌బోయే త‌ప్పుల‌ను లేడీస్ పొర‌పాటున కూడా చేయ‌కూడ‌దు.

చేశారో గుండె రిస్క్‌లో ప‌డ‌టం ఖాయం.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.

వివాహ‌మైన త‌ర్వాత చాలా మంది స్త్రీలు గర్భనిరోధక మాత్రలను తెగ వాడేస్తుంటారు.అయితే ఈ త‌ప్పే మీ గుండెకు ముప్పు తెచ్చిపెడుతుంది.అవును, గర్భ నిరోధక మాత్రలను అధికంగా వినియోగ‌డం వ‌ల్ల గుండెపై తీవ్ర ఒత్తిడి ప‌డుతుంది.ఫ‌లితంగా గుండె సంబంధిత స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి.

అలాగే ఈ మ‌ధ్య కాలంలో పురుషుల‌తో పాటు స్త్రీలు సైతం మ‌ద్య‌పానం, ధూమ‌పానం వంటి వాటికి బాగా అల‌వాటు ప‌డుతున్నారు.అయితే ఈ చెడు అల‌వాట్లు వ‌ల్ల‌ హార్ట్ స్ట్రోక్ వ‌చ్చే ప్ర‌మాదం భారీగా పెరుగుతుంది.

కాబ‌ట్టి, ఇక‌పై మ‌ద్య‌పానం, ధూమ‌పానం అల‌వాట్ల‌ను మానుకుంటే చాలా మంచిది.

చాలా మంది మ‌హిళ‌లు వ్యాయామాలు చేయ‌డానికి పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ చూప‌రు.దీని వ‌ల్ల ఫిట్ నెస్ దెబ్బ తిని బ‌రువు పెర‌గ‌డ‌మే కాదు.గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ సైతం పెరుగుతుంది.

కొంద‌రు శ‌రీర బ‌రువు ఎంత పెరుగుతున్నా ప‌ట్టించుకోరు.ఇదీ కూడా గుండెను డేంజ‌ర్ జోన్‌లో ప‌డేస్తుంది.కాబ‌ట్టి, బ‌రువును ఎల్ల‌ప్పుడూ అదుపులో ఉంచుకోవాలి.ఇక ఒత్తిడికి వీల‌నైంత వ‌ర‌కు దూరంగా ఉండాలి.

డైట్‌లో పోష‌కాహారం ఉండేలా చూసుకోవాలి.మ‌రియు ఏవైనా అనారోగ్య స‌మ‌స్య‌లు ఉంటే ఎప్ప‌టిక‌ప్పుడు చక‌ప్‌ చేయించుకుని మందులు వాడాలి.

If Women Make These Mistakes, Heart Health Is Damaged! Women, Women Health, Health, Health Tips, Good Health, Heart, Heart Health, Healthy Heart - Telugu Tips, Healthy Heart, Heart

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube