కుక్కలతో చాలా జాగ్రత్తగా ఉండాలి.రాత్రివేళ వీధుల్లో కుక్కలు అరుస్తూ ఉంటాయి.
ఎవరినైనా మనిషి చూడగానే పెద్ద పెద్దగా అరుస్తూ కనిపిస్తాయి.అయితే కుక్కలు అరుస్తున్నాయి కదా అని భయపడాల్సిన అవసరం లేదు.
సైలెంట్ గా వెళితే ఏం చేయవు.కానీ కొన్ని కుక్కలు మాత్రం దాడి చేస్తాయి.
కరిచేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి.ఇలాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
కుక్కకాటుకు చాలామంది గురవుతూ ఉంటారు.కుక్క కాటు వేసిప్పుడు పత్యం ఉండాల్సి ఉంటుంది.
ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవడంతో పాటు వర్షంతో తడవకుండా ఉండాల్సి ఉంటుంది.
ముఖ్యంగా వర్షాకాలంలో కుక్కకాటు కేసులు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
కుక్క కాటు అనేది చాలా ప్రమాదకరం.కుక్క కరిచినప్పుడు దాని చొంక ద్వారా రేబిట్ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించవచ్చు.
కుక్క లాలాజలం ద్వారా రేబిస్ వైరస్ గాయం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తే ఇన్పెక్షన్ తలెత్తే అవకాశముందని డాక్టర్లు సూచిస్తున్నారు.దీంతో కుక్క కరిచినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
కుక్క కరిచినప్పుడు శుభ్రమైన నీటితో గాయం మీద శుభ్రం చేసుకోవాలి.దీని ద్వారా బ్యాక్టీరియా అనేది శరీరం లోపలికి వెళ్లదు.దీని వల్ల ఇన్పెక్షన్ కూడా వచ్చే అవకాశం లేదు.అయితే ఇన్పెక్షన్ సోకినన్పుడు కుక్క కరిచిచోట తీవ్రమైన నొప్పి ఉంటుంది.
వాపుతో పాటు గాయం చుట్టూూ ఎర్రగా ఉంటుంది.

రక్తస్రావం అవ్వడంతో పాటు చీము కూడా పడుతుంది.గాయం చుట్టూ తిమ్మిరి వచ్చినట్లు అనిపిస్తుంది.అలాగే జ్వరం, చెమ ఎక్కవగా పడటం, తల తిరగడం లాంటి లక్షణాలు ఉంటాయి.
దీంతో కుక్క కరిచినప్పుడు పై లక్షణాలు కనిపిస్తే మీకు ఇన్పెక్షన్స్ సోకినట్లే.ఇలాంటి సమయాల్లో వెంటనే డాక్టర్ ను సంప్రదించం మంచిది.ఇక ఊరకుక్క కలిస్తే రేబిట్ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది.కుక్కకాటుకు చికిత్స తీసుకోకుండా అలసత్వం ప్రదర్శిస్తే.
కిడ్నీ ఫెయిల్యూర్, గుండెపోటు, గ్యాంగ్రేన్ వంటి వ్యాధులు ముప్పు పొంచి ఉంది.