సినిమా విడుదలైన 8 నెలలకు ఓటీటీలో పెళ్లి సందD?

కరోనా సమయంలో సినిమా థియేటర్లు మూత పడటంతో ఓటీటీల ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది.ఈ క్రమంలోనే ఓటీటీలలో ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి.

 సినిమా విడుదలైన 8 నెలలకు ఓటీటీ-TeluguStop.com

అయితే సినిమా థియేటర్లు ఓపెన్ అయిన తరువాత సినిమా థియేటర్లలో విడుదలయ్యే అనంతరం నాలుగు వారాలు లేదా ఆరు వారాలలో ఓటీటీలో విడుదల అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలు సైతం థియేటర్లో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలో ప్రసారమయ్యాయి.

తాజాగా ఒక సినిమా విడుదలైన తరువాత ఏకంగా ఎనిమిది నెలలకు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది.గౌరీ రోణంకి దర్శకత్వంలో శ్రీకాంత్ వారసుడు రోషన్, హీరోయిన్ శ్రీలీలని పరిచయం చేస్తూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో పెళ్లి సందD సినిమాను తెరకెక్కించారు.

సినిమా థియేటర్లలో విడుదలై పరవాలేదు అనిపించుకుంది.అయితే ఇప్పటికీ ఈ సినిమాని థియేటర్ లో చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓటీటీలో ఈ సినిమాను చూడటం కోసం ఎదురుచూసేవారి సంఖ్య అధికంగా ఉంది.

Telugu Theaters, Ott, Pelli Sandadi, Telugu, Tollywood-Movie

ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కోసం ఎదురు చూస్తూ కొన్ని నెలలు గడిచిపోయాయి.అయితే ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 24వ తేదీ నుంచి జీ 5 లో ప్రసారం కానుంది.ఈ సినిమా థియేటర్లో విడుదలయినప్పటికీ ఇన్ని నెలల పాటు ఓటీటీలో విడుదల కాకపోవడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.

రిలీజ్ టైంలో పెళ్లి సందD టీమ్ అడిగిన రేట్ కి ఓటిటిలు ఒప్పుకోలేదు. ఇలా సరైన ధరలు కుదరకపోవడంతో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ చాలా ఆలస్యమైంది.

ఇకపోతే ఈ సినిమాకి రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణ చేయడమే కాకుండా ఈ సినిమాలో నటుడిగా కూడా నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube