గుమ్మడి( Pumpkin ).ఇది ఒక పండు అయినప్పటికీ కూరగాయగా వర్గీకరించబడింది.
తక్కువ తీపి మరియు ఎక్కువ రుచికరమైన గుమ్మడిని చాలా మంది ఇష్టంగా తింటారు.గుమ్మడితో రకరకాల వంటలు తయారు చేస్తుంటారు.
గుమ్మడి తో చేసే కర్రీస్, హల్వా, సూప్ వంటివి ఎక్కువగా ప్రసిద్ధి చెందాయి.గుమ్మడి వంటకాలు టేస్టీ గా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
ఎందుకంటే గుమ్మడికాయలో పోషకాలు దండిగా ఉంటాయి.కాపర్, ఐరన్, మాంగనీస్, పొటాషియం, జింక్, విటమిన్ సి, విటమిన్ ఎ, విటిమన్ బి2, విటమిన్ ఇ, ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలకు గుమ్మడి గొప్ప మూలం.
అందుకే గుమ్మడిని కుదిరితే వారానికి ఒకసారి లేదా కనీసం నెలకు ఒకసారైనా తినాలని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా పురుషులు గుమ్మడిని అస్సలు మిస్ అవ్వకూడదు.పురుషులకు గుమ్మడి ఒక వరమనే చెప్పుకోవచ్చు.వారానికి ఒకసారి గుమ్మడికాయను తీసుకుంటే అందులోని పోషకాలు స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తాయి.
అదే సమయంలో పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి.
గుమ్మడికాయలో పొటాషియం( Potassium ) ఉంటుంది.
ఇది రక్తపోటును అదుపులో ఉంచి స్ట్రోక్ మరియు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.అలాగే ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
గుమ్మడికాయలో పుష్కలంగా ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.కణాల పెరుగుదలకు సహకరిస్తుంది.
గుమ్మడికాయలో బీటా-కెరోటిన్ క్యాన్సర్ నివారణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

గుమ్మడికాయలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది మిమ్మల్ని ఎక్కువ సమయం పాటు నిండుగా ఉంచుతుంది.రక్తంలో చక్కెరను క్రమబద్ధీకరించడానికి కూడా ఫైబర్ తోడ్పడుతుంది.గుమ్మడికాయలో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది, ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది మరియు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
తక్కువ కేలరీలను కలిగి ఉండటం వల్ల వెయిట్ లాస్ అవ్వాలని భావిస్తున్న వారికి గుమ్మడి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.







